Begin typing your search above and press return to search.

పూరీకి కొత్త అసిస్టెంట్ ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   10 Feb 2016 4:16 AM GMT
పూరీకి కొత్త అసిస్టెంట్ ఎవరో తెలుసా?
X
ఓ నెలన్నర క్రితం పూరీ తన సెటప్ మొత్తాన్ని ఛేంజ్ చేసేశాడు. లోఫర్ రిలీజ్ తర్వాత.. ఓ వివాదం కారణంగా తన అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ పంపేశాడు. సంవత్సరాల తరబడి తన దగ్గర పనిచేస్తున్న వాళ్లందరినీ ఒకేసారి తీసేయడం ఆశ్చర్యం కలిగించినా.. మరీ క్లోజ్ నెస్ ఎక్కువయిపోవడంతో తన మాట వినని పరిస్థితి వచ్చిందనే రీజన్ చెప్పాడు పూరీ.

మరి పూరీ ఏమో సూపర్ ఫాస్ట్ డైరెక్టర్. స్క్రిప్ట్ రెడీ చేసి, సినిమా తీసేందుకు గట్టిగా నాలుగైదు నెలలు కూడా తీసుకోడు. మరి ఇంత స్పీడ్ గా కంప్లీట్ చేయాలంటే.. ఖచ్చితంగా అసిస్టెంట్ డైరెక్టర్స్ అవసరమే. అందుకోసం కొత్తవాళ్లను తెచ్చుకోక తప్పదు. అందులో భాగంగానే కొత్త కుర్రాడిని పట్టుకొచ్చేశాడు. అతనెవరో కాదు.. ఆకాష్. తన కొడుకు ఆకాష్ నే పూరీ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేశాడు. ఆల్ మోస్ట్ ప్రమోషన్ ఇచ్చేశాడన్న మాట.

ఆంధ్రాపోరీతో టీనేజ్ హీరోగా అరంగేట్రం చేసిన ఆకాష్.. బాల నటుడిగానూ చాలా సినిమాల్లోనే నటించాడు. అయితే హీరో కేరక్టర్ లో సక్సెస్ కాకపోవడంతో బాగా గ్యాప్ మెయింటెయిన్ చేశాడు. ఇప్పుడు తండ్రి తీస్తున్న రోగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుండడం విశేషం. హీరోలు ఇలా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేయడం.. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న ట్రెండే. హ్రితిక్ రోషన్ - రణ్ బీర్ కపూర్ - సోనమ్ కపూర్ లు కూడా ఇలా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి.. సినిమా తీసే విధానాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నాకే.. తెరంగేట్రం చేశారు.