Begin typing your search above and press return to search.

బాలకృష్ణ-పూరీ సినిమాకు ముహూర్తం రెడీ!

By:  Tupaki Desk   |   24 Feb 2017 1:48 PM GMT
బాలకృష్ణ-పూరీ సినిమాకు ముహూర్తం రెడీ!
X
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది. పూరి జగన్నాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. పవర్‌ ఫుల్‌ డైలాగులంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చే స్టార్‌ హీరో బాలకృష్ణ. హీరోయిజాన్ని ప్రతి సీన్లోనూ ఎలివేట్ చేస్తూ.. పంచ్ డైలాగులతో మోత మోగించడం పూరీ స్టైల్. వీరిద్దరి కాంబినేషన్‌ లో సినిమా అనగానే నందమూరి అభిమానుల్లో మామూలు క్రేజ్ వుండదు. ఇలాంటి కాంబినేషన్ సెట్టవుతుందని కలలో కూడా ఊహించి వుండరు అభిమానులు. అది నిజమైంది.

మహాశివరాత్రి సందర్భంగా ఈ సెన్సేషనల్ కాంబినేషన్ గురించి పూరీ ట్విట్టర్లో వెల్లడించారు. ‘‘రాకింగ్‌ అనౌన్స్‌ మెంట్‌. బాలకృష్ణగారితో... భవ్య క్రియేషన్స్‌ ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ట్వీట్‌ చేశారు. దానిని కన్ ఫర్మ్ చేస్తూ నిర్మాత కూడా స్పందించారు.

నిర్మాత వి. ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘బాలకృష్ణ–పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌ లో మొదటి సినిమా మా సంస్థలో నిర్మించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. పవర్‌ ఫుల్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌ టైనింగ్‌ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నాం. బాలకృష్ణగారి పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ కీ... పూరి జగన్నాథ్‌ పెన్‌ పవర్‌ కీ ... ఆయనలో దర్శకుడికీ తగ్గ అద్భుతమైన కథ కుదిరింది. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మిస్తాం. చాలా కొత్తగా ఉండబోతుందీ సినిమా. మార్చి 9న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభిస్తాం. షూటింగ్‌ కూడా ఆ రోజే మొదలవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో కథానాయికలు... ఇతర తారాగణం... సాంకేతిక నిపుణులు... మిగతా వివరాలను ప్రకటిస్తాం’’ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/