Begin typing your search above and press return to search.

రామ్ మిస్సయిన హీరోయిన్ తో జగన్‌

By:  Tupaki Desk   |   24 Nov 2015 5:06 AM GMT
రామ్ మిస్సయిన హీరోయిన్ తో జగన్‌
X
టాలీవుడ్ స్పీడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇటీవ‌లే రోగ్ మూవీని లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ఓపెనింగ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌ లో సైలెంటుగా పూర్త‌యింది. ఈ చిత్రంతో మ‌హాత్మ నిర్మాత సి.ఆర్‌.మ‌నోహ‌ర్‌ అన్న కొడుకు హీరోగా లాంచ్ అవుతున్నాడు. క‌థానాయిక‌గా ముంబై మోడ‌ల్ అమైరా ద‌స్త‌ర్ న‌టిస్తుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. కానీ చివ‌రి నిమిషంలో బంతి కోర్టు మారింది.

అమైరా బిజీ షెడ్యూళ్ల వల్ల ఈ మూవీలో న‌టించే అవ‌కాశాన్ని మిస్ చేసుకుంది. ఇప్పుడు ఆ ప్లేసుని రామ్ హీరోయిన్ ఐషా శ‌ర్మ‌తో రీప్లేస్ చేశార‌ని స‌మాచారం. ఐషా శ‌ర్మ చిరుత ఫేం నేహా శ‌ర్మ సోద‌రి. త‌న‌ని కూడా టాలీవుడ్‌ లో లాంచ్ చేసింది పూరీనే. కానీ నేహా కెరీర్ లో ఆశించినంత దూసుకెళ్ల‌లేదు. ఇప్పుడు ఐషా శ‌ర్మ రామ్ స‌ర‌స‌న శివ‌మ్ మూవీలో న‌టించింది. అదేంటి ఆ సినిమా రాశి ఖన్నా కదా హీరోయిన్‌ అంటారా? అబ్బే.. ముందు ఐషా శర్మే హీరోయిన్‌. ఓ నాలుగు రోజులు షూటింగ్‌ చేశాక.. ఈమెను తప్పించి రాశి ఖన్నాను దించారు. రీజన్స్‌ మాత్రం తెలియదు. కాని ఈమె అవుట్‌. ఆ సినిమా మిస్సయినా.. ఇప్పుడు పూరి ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది.

రోగ్ పూర్తి క‌మ‌ర్షియ‌ల్ సినిమా. కొత్త హీరోని లాంచ్ చేస్తున్నాడు కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే క‌మ‌ర్షియ‌ల్ ఇంగ్రీడియెంట్‌ ని ఈ మూవీలో చూపిస్తున్నాడ‌ట. పూరి జగన్‌ సినిమాలో న‌టించే చాన్స్ అంటే మునుముందు బోలెడంత స్కోప్ ఉంటుంది. మ‌రి ఐషా శ‌ర్మ ఆ రేంజులో దూసుకుపోతుందా? లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ మూవీ వ‌చ్చే వ‌ర‌కూ చూడాల్సిందే.