Begin typing your search above and press return to search.

పూరీ.. పంచ్ చిరుకి వేశావా?

By:  Tupaki Desk   |   21 Oct 2016 4:35 AM GMT
పూరీ.. పంచ్ చిరుకి వేశావా?
X
పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా.. ఇజం రిలీజ్ ఇవాళే. ప్రమోషన్ యాక్టివిటీస్ లో భాగంగా దర్శకుడు పూరీ తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత.. తను డైరెక్ట్ చేసిన మూవీ మంచి బజ్ తో రిలీజ్ అవుతుండడంతో.. బాగా ఉత్సాహంగా ఉన్నాడు పూరీ.

'లైఫ్ లో రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే ఏమైనా చేయచ్చు.. కాజల్ సమంత అయితే సేఫ్ బెట్ అనుకుంటే లైఫ్ లో కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయలేవు. అలాగే హీరోలు కూడా అంతే.. కొత్త కథ చేద్దాం అనే ఫైర్ వాళ్లలో ఉంటే కొత్త కథలు వస్తాయ్. లేదూ రీమేక్ లకే వెళ్దాం ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటే.. లైఫ్ లో వాళ్లు తీయలేరు' అన్నాడు పూరీ. కొత్త హీరోయిన్స్ ఇంట్రడక్షన్ గురించి మొదలుపెట్టి.. హీరోలు కొత్త కథలు యాక్సెప్ట్ చేయడం వరకూ తన స్టైల్ లో మాటల మాయ చేసేశాడు పూరీ.

పూరీతో సినిమా అనుకుని.. చివరకు రీమేక్ చేస్తున్నది మెగాస్టార్ చిరంజీవే కాబట్టి.. పూరీ పంచ్ ఆయనకే అనే విషయం.. పైకి చెప్పకపోయినా అర్ధమైపోతుంది. అయితే.. మెగాస్టార్ అయినా ఇంకోళ్లయినా.. కొత్త కథతో రిస్క్ చేద్దాం అనుకుంటే.. హిట్ రేషియో ఎక్కువగా ఉన్న రాజమౌళి.. త్రివిక్రమ్ లతో చేస్తారు కానీ.. అవుటాఫ్ ఫేమ్ అయిపోయి.. ఇంకో రైటర్ స్టోరీ ఇస్తే తప్ప కానీ హిట్ కొట్టలేని పూరీతో ఎందుకు చేస్తారన్నదే అసలు డౌట్ అంటున్నారు ఫ్యాన్స్.

అయినా.. చిరు చాలానే ప్రయోగాలు చేసి.. టాలీవుడ్ కి చాలానే పరిచయం చేసే ఈ స్టేజ్ కి వచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పూరీ అయినా.. ఇంకోళ్లయినా.. ఎక్స్ పెరిమెంట్స్ గురించి చిరును ఉద్దేశించి మాట్లాడ్డమంటే.. అది బాగా కామెడీ అయిపోతుందేమో కదూ!