Begin typing your search above and press return to search.

101 బాలయ్యతోనే.. జనగనమణ కాదులే

By:  Tupaki Desk   |   23 Feb 2017 10:01 AM GMT
101 బాలయ్యతోనే.. జనగనమణ కాదులే
X
ఇప్పుడు టాలీవుడ్ లో మరో కొత్త మాట వినిపిస్తోంది. అదేంటంటే.. దర్శకుడు పూరి జగన్ అండ్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో రానున్న సినిమా తాలూకు ఎనౌన్స్మెంట్ రేపు ఇచ్చేస్తారట. పైగా అందరూ అనుకున్నట్లు ఈ సినిమా ఆ కథతో తీయట్లేదు. పదండి అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.

మహేష్‌ తో చేయాల్సిన జన గన మణ సినిమాను ముందుగా వెంకీతో చేద్దాం అనుకుని.. అక్కడ వర్కవుట్ కాకపోతే అదే కథను బాలయ్యకు నెరేట్ చేశాడని ఒక రూమర్ ఉంది. కాని నిజానికి పూరి జగన్ ఎప్పుడో బాలయ్య కోసం ఒక కథను రెడీ చేసి పెట్టాడట. ఇప్పుడు ఆ కథను స్టార్టింగ్ టైటిల్ నుండి ఎండింగ్ టైటిల్ వరకు పూర్తిగా బాలయ్యకు వినిపించడంతో ఆయన వెంటనే సినిమాను ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనే విషయంపై ఇంకా పూరి ఒక క్లారిటీకి రాలేదు కాని.. తన పూరి కనెక్ట్స్ సంస్థ ద్వారానే ఓ ఇద్దరు కొత్త మోడల్స్ ను హీరోయిన్లుగా పరిచయం చేస్తాడని ఓ టాక్.

ఇకపోతే ఒక ప్రక్కన పూరి జగన్ తో సినిమా చేస్తూనే.. మరో ప్రక్కన కె.ఎస్.రవికుమార్ సినిమాను కూడా బాలయ్య పట్టాలెక్కించే ఛాన్సు ఉందని తెలుస్తోంది. మరి బాలయ్య 101 మరియు 102 సినిమా తాలూకు అఫీషియల్ ప్రకటన కోసం వెయిట్ చేద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/