Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ని నిలదీసిన పూరీ

By:  Tupaki Desk   |   25 March 2017 9:17 AM GMT
మెగాస్టార్ ని నిలదీసిన పూరీ
X
మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖైదీ నంబర్ 150తో కొత్త రికార్డులు నమోదు చేసిన చిరు కంబ్యాక్ అదిరిపోయింది. అయితే.. మొదట మెగా కంబ్యాక్ మూవీ డైరెక్షన్.. పూరీ జగన్నాధ్ చేతికి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాలతో అప్పుడు అనుకున్న ఆటోజానీ ఆగిపోయి.. కత్తి రీమేక్ చేశారు చిరు.

అయితే.. మెగా 150 కాకపోతే.. 151వ సినిమానో.. 152వ సినిమానో ఏదో ఒకటి చేసి తీరతాను అని గతంలో చెప్పాడు పూరీ జగన్నాధ్. ప్రస్తుతం ఇది ఎంతవరకూ సాధ్యమో చెప్పలేం కానీ.. మెగాస్టార్ ని పూరీ నిలదీసిన వైనం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. స్టార్ మా ఛానల్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి.. లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో గెస్ట్ గా ప్రకాష్ రాజ్ రాగా.. ఓ ప్రశ్నకు జవాబు కోసం పూరీ జగన్నాధ్ కి ఫోన్ చేశాడు ప్రకాష్ రాజ్.

ఆన్సర్ ఇచ్చాడో లేదో తెలియదు కానీ.. 'ఇంతకీ మీరు నాతో సినిమా చేస్తారా చేయరా చెప్పండి' అంటూ ఫోన్ లో డైరెక్టుగా చిరుని అడిగేశాడు పూరీ జగన్నాధ్. దానికి చిరంజీవి నవ్వుతోనే సమాధానం ఇచ్చిన వైనం ఆకట్టుకుంటోంది. కాంబినేషన్ లో మళ్లీ ఫ్యాన్స్ లో ఆశలు రేపుతోంది. మరి ఈ కాంబో ఎప్పటికి సాధ్యమయ్యేనో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/