బాలయ్య డైలాగులకు.. సిడి సరిపోదు

Thu Aug 17 2017 13:55:58 GMT+0530 (IST)

పూరీ జగన్నాధ్ తీయబోతున్న సినిమా పైసా వసూల్లో హీరో నందమూరి బాలకృష్ణ అనే వార్త విన్నప్పటి నుండి ఫిల్మ్ నగర్ ఎంత షాక్ అయ్యిందో తెలియదు కానీ బాలయ్య అభిమానులు మాత్రం పండుగ చేసుకున్నారు. పూరీ జగన్నాధ్  తన సినిమాలో హీరోని చూపించే స్టైల్ వేరేగా ఉంటుంది. వీరం పొగరు ఏ మాత్రం తగ్గకుండా రెండు వైపులా పదున్న కత్తిలా చూపిస్తాడు. మరి అలాంటి డైరెక్టర్ తో బాలయ్య మొదటిసారి పని చేస్తే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో పైసా వసూల్ సినిమాకు కూడా అంతే క్రేజ్ ఏర్పడింది.

పైసా వసూల్ పోస్టర్ విడుదల దగ్గరనుండి నిన్న విడుదలైన ప్రోమో సాంగ్ వరకు చూస్తే అందరికీ ఒక్క దాన్ని పైనే దృష్టి ఉంది బాలయ్య లుక్ పైన బాలయ్య  డైలాగ్లు పైన. ఇప్పటికీ వరకు చూసిన బాలకృష్ణ వేరు ఈ సినిమాలో బాలకృష్ణ వేరుని పైసా వసూల్ స్టంపర్ మేకింగ్ వీడియొ చూస్తేనే అర్ధంవుతుంది. అయితే ఈ మధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో పూరీ బాలయ్య అభిమానులుకు ఒక మాట ఇచ్చాడు. పూరీ బాలయ్య గురించి మాట్లాడుతూ " నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవకాశం ఇది. బాలయ్య తో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా కోరిక నెరవేర్చిన బాలయ్యకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా అభిమానులుకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. మీరు బాలయ్య నుండి ఏమి కోరుకుంటున్నారో అవి అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. దానికి నేను హామీ. జై బాలయ్య" అని చెప్పాడు.

ఈ సినిమాలో బాలయ్య  డైలాగ్లు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రశ్నకు పూరీ జగన్నాధ్ తన స్టైల్ లో జవాబు ఇచ్చాడు. ''ఈ సినిమాలో బాలయ్య డైలాగ్లుకి ఒక ఆడియో సిడి సరిపోదు మీరే చూస్తారు కదా'' అని చెబుతున్నాడు. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 న విడుదలవుతుంది. ఈ సినిమా  బాలకృష్ణ చేస్తున్న 101 వ సినిమా కావడం విశేషం. అనూప్ రుబెన్స్ సంగీతం ఇస్తున్న ఈ సినిమాలో శ్రీయ శరణ్ ముస్కాన్ సేథి హీరోయిన్స్ గా చేస్తున్నారు. కైరా దత్ తన అందాలను దారబోస్తోంది.