Begin typing your search above and press return to search.

పూరి.. టెంపర్ రూట్లోనే వెళ్తున్నాడు

By:  Tupaki Desk   |   2 Sep 2015 1:44 PM GMT
పూరి.. టెంపర్ రూట్లోనే వెళ్తున్నాడు
X
పూరి జగన్నాథ్ అంత స్పీడుగా సినిమాలు ఎలా పూర్తి చేస్తాడో జనాలకు అర్థం కాదు. స్క్రిప్టు రాయడంలోనైనా.. సినిమా తీయడంలోనైనా.. పూరి స్పీడును అందుకోవడం మిగతా డైరెక్టర్లకు చాలా కష్టం. ఆ స్పీడు మరీ ఎక్కువైపోయి తన సినిమాల్లో క్వాలిటీ కూడా తగ్గిన మాట వాస్తవమే. ఐతే గతంలో పూరి తీసిన సూపర్ హిట్ల విషయంలో కూడా పూరి ఇదే స్పీడు చూపించాడు. అందుకే ఆ స్పీడు విషయంలో ఆయన రాజీ పడడు. ఈ ఏడాది పూరి నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా కూడా ఈ ఏడాది ఆఖర్లోపు రిలీజైపోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు పూరి. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో చేస్తున్న సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలన్నది ఆయన ప్లాన్.

ఎన్టీఆర్ తో పూరి తీసిన 'టెంపర్' విషయంలో ఆయన మామూలు కంటే స్పీడు చూపించాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ తరుముకొస్తుండటంతో ఆయన ఓ ట్రిక్ ప్లే చేశాడు. షూటింగ్ చేస్తున్నపుడే ఎప్పటికప్పుడు ఎడిటింగ్ కూడా పూర్తి చేసేశాడు. దీని వల్ల మళ్లీ షూటింగయ్యాక ప్రత్యేకంగా ఎడిటింగ్ కోసం కూర్చోవాల్సిన పని తప్పింది. ఉదయం షూటింగ్ చేయడం.. రాత్రికి ఎడిటింగ్.. ఓ వారమో పదిరోజులో అయ్యాక మరింత ట్రిమ్ చేసి.. సీక్వెన్స్ ప్రకారం ఔట్ పుట్ రెడీ చేయడం.. ఇలా సాగింది 'టెంపర్' వ్యవహారం. ఇప్పుడు 'లోఫర్' విషయంలోనూ అదే ఫార్మాట్లో వెళ్తున్నాడు పూరి. ఇప్పటిదాకా పూర్తయిన 60 శాతం షూటింగ్ కు సంబంధిచింన సన్నివేశాలన్నింటికీ ఎడిటింగ్ పూర్తయిందట. ఇంకో రెండు నెల్లో మొత్తం సినిమా పూర్తి చేసి.. నేరుగా డబ్బింగ్ కు వెళ్లిపోవాలని భావిస్తున్నాడు పూరి.