Begin typing your search above and press return to search.

జగపతి వాయిస్ మలయాళంలో వింటారా?

By:  Tupaki Desk   |   24 May 2016 11:30 AM GMT
జగపతి వాయిస్ మలయాళంలో వింటారా?
X
సౌత్ ఇండియాలో ప్రస్తుతం బిజీయెస్ట్ యాక్టర్స్ లిస్టు తీస్తే.. అందులో జగపతి బాబు పేరు కచ్చితంగా ఉంటుంది. ‘లెజెండ్’ సినిమాలో విలన్ అవతారం ఎత్తాక ఆయన దశ తిరిగిపోయింది. ఇంతింతై అని ఎదిగిపోయి.. ఒక్కో సినిమాకు కోటిన్నర దాకా పారితోషకం తీసుకునే రేంజికి ఎదిగిపోయాడు జగపతి. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ జగపతికి డిమాండ్ ఉందిప్పుడు. తెలుగుతో పాటు తమిళం-మలయాళం-కన్నడం భాషల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు మన హీరో. మలయాళంలో జగపతి.. మోహన్ లాల్ లాంటి బడా హీరో సినిమాలో విలన్ పాత్ర పోషించడం విశేషం. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ‘పులి మురగన్’.

ఈ మధ్య వరుసగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్న మోహన్ లాల్.. చాన్నాళ్ల విరామం తర్వాత పూర్తి స్థాయి యాక్షన్ హీరో పాత్ర పోషించిన సినిమా ‘పులి మురుగన్’. వీర లెవెల్లో హీరోయిజం ఉన్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండియాలో అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది ‘పులి మురుగన్’ టీజర్.

అద్భుతమైన విజువల్స్.. ఆసక్తికరమైన నరేషన్ తో ఈ టీజర్ యూట్యూబ్ లో ఈ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టీజర్లో జగపతి బాబుకు కూడా చోటు దక్కింది. జగపతి బాబు నోట మలయాళ మాటలు వింటుంటే కొత్తగా అనిపిస్తోంది. ఐతే జగపతి సొంతంగా ఏమీ డబ్బింగ్ చెప్పుకోలేదు. డబ్బింగ్ చెప్పించారు. కాస్త ఆడ్ గానే అనిపిస్తోంది ఆ వాయిస్. టీజర్లో హైలైట్ చివర్లో పులి లాగా మోహన్ లాల్ గర్జించడమే. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.