Begin typing your search above and press return to search.

హీరో శ్రీకాంత్ ఇంట్లో 'సైకో' విధ్వంసం

By:  Tupaki Desk   |   24 Sep 2017 5:06 AM GMT
హీరో శ్రీకాంత్ ఇంట్లో  సైకో  విధ్వంసం
X
షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక సినీ ప్ర‌ముఖుడి ఇంట్లో జ‌ర‌గ‌రానిది జ‌రిగింది. హీరోగా సుప‌రిచితుడు.. సినీ ప్ర‌ముఖుడిగా అంద‌రికి తెలిసిన శ్రీకాంత్ ఇంట్లోని కార్ల‌ను ధ్వంసం చేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
ప‌లు చిత్రాల్లో హీరోగా న‌టించిన హీరో శ్రీకాంత్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌రు 76లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ ఇంట్లో గ‌తంలో వంట‌మ‌నిషిగా ప‌ని చేసిన వెంక‌టేశ్ శ‌నివారం ఉద‌యం ప‌ది గంట‌ల స‌మ‌యంలో శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నాడు. అంత‌లోనే ఏమైందో ఏమో కానీ ఇంటి గేటు తీసి బండ రాళ్ల‌తో బీఎండ‌బ్ల్యూ కారును.. ఫోర్డ్‌ కారును ధ్వంసం చేశాడు. ఊహించ‌ని ప‌రిణామంతో శ్రీకాంత్ ఇంటి సిబ్బంది అవాక్క‌య్యారు.

ఆ త‌ర్వాత విష‌యాన్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే స్పందించిన పోలీసులు శ్రీకాంత్ నివాసానికి చేరుకున్నారు. ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న కార్ల‌ను ధ్వంసం చేసిన‌ వెంక‌టేశ్‌ ను హీరో శ్రీకాంత్ స్వ‌యంగా అప్ప‌గించారు.

ఈ విష‌యంపై పోలీసుల క‌థ‌నం ఏమిటంటే.. క‌ర్నూలు జిల్లాకు చెందిన 29 ఏళ్ల బి. వెంక‌టేశ్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌రు 10లో వ్యాక్స్ బేక‌రీ స‌మీపంలో ఉన్నాడు. ప‌దేళ్లుగా జూబ్లీహిల్స్ లోని ప‌లువురుప్ర‌ముఖుల నివాసాల్లో వంట మ‌నిషిగా ఉన్నాడు. హీరో శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. మూడేళ్ల క్రితం శ్రీకాంత్ ఇంట్లో మూడు నెల‌లు వంట మ‌నిషిగా ప‌ని చేశాడు. అయితే.. అత‌ని తీరు బాగోక‌పోవ‌టం.. సైకోలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో అత‌న్ని విధుల నుంచి తొల‌గించారు.
ప్ర‌స్తుతం ఒక రాజ‌కీయ నాయ‌కుడి ఇంట్లో వంట‌మ‌నిషిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా శ్రీకాంత్ ఇంటికి వ‌చ్చిన వెంక‌టేశ్‌.. శ్రీకాంత్ త‌న‌కు క‌ల‌లో వ‌స్తున్నాడ‌ని.. ఆయ‌న్ను క‌ల‌వాలంటూ ఇంట్లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు.

వాచ్ మెన్ అడ్డుకోవ‌టంతో అత‌డ్ని నెట్టేసి.. అక్క‌డే ఉన్న క‌ర్ర‌తో బీఎండ‌బ్ల్యూ.. ఫోర్ట్ కార్ల అద్దాల్ని ప‌గ‌ల‌గొట్టాడు. అంత‌టితో ఆగ‌కుండా ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిచాడు.

అత‌డ్ని అడ్డుకునేందుకు వ‌చ్చిన డ్రైవ‌ర్ ను నెట్టేసి శ్రీకాంత్ బెడ్రూంలోకి దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. మెట్ల మీద నుంచి దిగుతున్న శ్రీకాంత్‌.. వెంక‌టేశ్‌ను ఎవ‌రు నువ్వు అంటూ ప్ర‌శ్నిస్తున్న టైంలో అత‌డ్ని నెట్టేసే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే.. శ్రీకాంత్ అప్ర‌మ‌త్తంగా ఉండ‌టంతో కింద ప‌డే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. వెంక‌టేశ్ ఇంట్లోకి ప్ర‌వేశించే టైంలో శ్రీకాంత్ స‌తీమ‌ణి ఊహ‌.. పిల్ల‌లు ఇంట్లో లేరు.

ఇదిలా ఉంటే.. వెంక‌టేశ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసుల‌కు మ‌రో చిక్కొచ్చి ప‌డింది. శ్రీకాంత్ మీద త‌న‌కున్న అభిమానంతో ఆయ‌న్ను క‌లిసే ప్ర‌య‌త్నం చేశాన‌ని ఒక‌సారి.. త‌న‌లోని మ‌రో వ్య‌క్తిని శ్రీకాంత్ బ‌య‌ట‌కు ర‌ప్పించాడంటూ పొంత‌న లేని స‌మాధానాలు ఇస్తుండ‌టంతో ఏం చేయాలో అర్థం కాక త‌ల ప‌ట్టుకుంటున్నారు పోలీసులు. సైకో మాదిరి మాట‌లు చెబుతూ.. త‌న‌లోని అప‌రిచితుడు దాడి ఉన్నాడ‌ని..వాడే బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని.. అస‌లు వెంక‌టేశ్ బ‌య‌ట‌కు రాలేదంటూ చెబుతున్న మాట‌లు పోలీసుల‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. చివ‌ర‌కు.. అత‌డిపై క్రిమిన‌ల్ కేసులో న‌మోదు చేసి అరెస్ట్ చేశారు.