సునీల్ మళ్లీ పొడిచేస్తాడన్నారు.. ఏం జరిగింది?

Wed Dec 19 2018 07:00:01 GMT+0530 (IST)

విభిన్న తరహా కామెడీతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న కమెడియన్ పృథ్వీ ముఖ్య పాత్రలో నటించిన బ్లఫ్ మాస్టర్ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంపై పృథ్వీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో తాను మరింత బిజీ అవుతానని ఈ చిత్రంతో తనకు కొత్త ఇమేజ్ వస్తుందని ఆశిస్తున్నాడు. బ్లఫ్ మాస్టర్ విడుదల సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు. ఆ సమయంలోనే సునీల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కమెడియన్స్ హీరోగా మారి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కామెడీ చేస్తానంటే ప్రేక్షకులు ఒప్పుకోరని వారు సక్సెస్ అవ్వడం దాదాపుగా అసాధ్యం. సునీల్ ఏడు సంవత్సరాల పాటు హీరోగా ప్రయత్నాలు చేశాడు. మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా చేస్తానంటు వచ్చాడు. సునీల్ కమ్ బ్యాక్ అంటూ తెగ హడావుడి చేశారు సునీల్ మళ్ళీ పొడిచేస్తాడని అన్నారు కమెడియన్ గా ఆయన కమ్ బ్యాక్ ఏమాత్రం సక్సెస్ కాలేదు. కమెడియన్ గా కూడా సునీల్ ప్రేక్షకుల ఆధరణ పొందలేక పోతున్నాడని పృథ్వీ అన్నాడు.

సినీ పరిశ్రమలో ఒక్కో సమయంలో ఒకొక్కరిది టైం నడుస్తుంది. అప్పట్లో బ్రహ్మానందం గారిది ఆ తర్వాత సునీల్ ల టైం నడిచింది. ఇప్పుడు నాతో పాటు మరికొందరు కమెడియన్స్ కు మంచి ఛాన్స్ లు ఉన్నాయని అన్నాడు. కమెడియన్ గానే మిగిలి పోకుండా కోట శ్రీనివాస రావు గారు చెప్పినట్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయాలని భావిస్తున్నాను. వినయ విధేయ రామ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ రోల్ దక్కింది. ఆ రోల్ తప్పకుండా నా కెరీర్ కు మరింతగా ఉపయోగపడుతుందని భావిస్తున్నానన్నాడు.