Begin typing your search above and press return to search.

బాహుబ‌లి రిలీజ్ పై ఒట్టు పెట్టుకున్నార‌ట‌

By:  Tupaki Desk   |   19 April 2017 5:43 AM GMT
బాహుబ‌లి రిలీజ్ పై ఒట్టు పెట్టుకున్నార‌ట‌
X
ఇవాల్టి నుంచి స‌రిగ్గా ప‌దో రోజు.. ప్ర‌తి సినీ అభిమానికి పండ‌గ‌రోజు. నెల‌ల త‌ర‌బ‌డి నిరీక్ష‌ణ ముగిసే రోజు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగానికి ముఖ్య‌మైన రోజు. అప్పుడెప్పుడో వ‌చ్చి.. నేటికీ క్లాసిక్ గా నిలిచిన మొఘ‌ల్ ఏ అజం సినిమాతో పోల్చిన బాహుబ‌లి 2 రిలీజ్ కానున్న రోజు. ఏప్రిల్ 28 ఎప్పుడు వ‌స్తుందా? అని నిత్యం క్యాలెండ‌ర్‌ ను చూసుకుంటున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. క‌ర్ణాట‌క‌లో మాత్రం సీన్ మ‌రోలా ఉంది. బాహుబ‌లి 2ను ఎట్టి ప‌రిస్థితుల్లో విడుద‌ల కానివ్వ‌మంటూ తేల్చి చెబుతున్నారు.

సినిమా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. బాహుబ‌లి2కి వ్య‌తిరేకంగా నిర్వ‌హిస్తున్న ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు అంత‌కంత‌కూ పెంచుతున్నారు. తాజాగా బాహుబ‌లి2ను ఎట్టి ప‌రిస్థితుల్లో విడుద‌ల కానివ్వ‌మని.. విడుద‌ల‌ను అడ్డుకుంటామంటూ క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. కావేరీ జ‌లాల‌కు సంబంధించి స‌త్య‌రాజ్.. గ‌త ద‌శాబ్ద‌కాలంగా ప్ర‌తిసారీ ఏదో ఒక వ్యాఖ్య చేస్తున్నార‌ని.. ఆయ‌న తీరుకు నిర‌స‌న‌గా బాహుబ‌లి 2 విడుద‌ల‌ను అడ్డుకోనున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

క‌ర్ణాట‌క‌లోని ప‌లుచోట్ల క‌ట్ట‌ప్ప అలియాస్ స‌త్య‌రాజ్ దిష్టిబొమ్మ‌ను ఊరేగించి.. నిర‌స‌న తెలిపారు. క‌న్న‌డిగుల‌ను దూషించ‌టం ఈ మ‌ధ్య‌న త‌మిళ న‌టుల‌కు అల‌వాటుగా మారిందని ర‌క్ష‌ణ వేదిక‌కు నేతృత్వం వ‌హిస్తున్న రాజేష్ మండిప‌డుతున్నారు. మ‌రీ.. ఆందోళ‌న‌లు రిలీజ్ ముందు నాటికి సెట్ అవుతాయా? లేక విడుద‌ల‌ను అడ్డుకుంటాయా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/