Begin typing your search above and press return to search.

బోయపాటితో వచ్చిన చిక్కే అది!

By:  Tupaki Desk   |   18 Sep 2019 6:15 AM GMT
బోయపాటితో వచ్చిన చిక్కే అది!
X
భద్రతో దర్శకుడిగా పరిచయమై రెండో సినిమా తులసితోనే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాక మాస్ జోనర్ లో ఓ ప్రత్యేకమైన ముద్ర వేసిన బోయపాటి శీను ఎట్టకేలకు బాలకృష్ణతో సినిమా ఓకే చేయించుకుని హమ్మయ్య అనుకున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇప్పుడు బాలయ్య చేస్తున్న కెఎస్ రవికుమార్ ప్రాజెక్ట్ స్థానంలో బోయపాటిది ఉండాలి. కాని వినయ విదేయ రామ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి.

అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపు ఖర్చు పెట్టిస్తాడు అని పేరు తెచ్చుకున్న శీనుతో వెంటనే రిస్క్ చేసేందుకు బాలయ్య ఆలోచించాడు. అప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ లో ఉన్న తనకు మళ్ళీ 40 కోట్ల బడ్జెట్ తో బోయపాటి వచ్చేసరికి తాత్కాలికంగా నో చెప్పాడు .ఇప్పటికి అది ఫైనల్ అయ్యింది. దీని వెనుక కారణం బోయపాటితో ఉన్న ఈ బడ్జెట్ చిక్కేనని ఇండస్ట్రీ టాక్.

రామ్ చరణ్ సినిమాలో సైతం రాజస్తాన్ లో తీస్తే సరిపోయే సన్నివేశాల కోసం యూనిట్ మొత్తాన్ని విదేశాలకు తీసుకెళ్లి మరీ షూట్ చేయడం పట్ల అప్పట్లోనే కామెంట్స్ వచ్చాయి. అన్ని సరిగ్గా కుదిరి వండితే బోయపాటి సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో పెట్టుబడిని ఈజీగా కవర్ చేస్తాడు. ఏ మాత్రం తేడా వచ్చినా దమ్ము లాగా వాచిపోయే డిజాస్టర్ ఇస్తాడు. అందుకే బోయపాటితో కమిట్ అయ్యే ముందు నిర్మాతలు ఇవన్నీ ఆలోచించుకుని మరీ బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ కారణాల వల్లే బాలయ్య సినిమా కాస్త ఆలస్యంగా మొదలైందని ఫిలిం నగర్ టాక్