Begin typing your search above and press return to search.

మొత్తానికి ప్రొడ్యూసర్లు దొరికేస్తున్నారు

By:  Tupaki Desk   |   20 March 2018 4:57 AM GMT
మొత్తానికి ప్రొడ్యూసర్లు దొరికేస్తున్నారు
X
పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి సంపాదించిన పాపులారిటీ పుణ్యమా అని.. మహేష్ కత్తికి క్రేజ్ బాగానే పెరిగింది. మొదటగా పవన్ ను వ్యతిరేకించే వారిని ఆకట్టుకున్న ఈయన.. మీడియా ప్రాపగాండాతో మరింతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ తో సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇప్పటివరకూ ఓ క్రిటిక్ గా గుర్తింపు పొందిన మహేష్.. ఓ సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నాడని గతంలోనే చెప్పేసుకున్నాం.

ప్రస్తుత రాజకీయాలపై ఓ పొలిటికల్ సైటైర్ ను తెరకెక్కిస్తాడట మహేష్ కత్తి. గతంలో ఎగిసే తారాజువ్వలు అనే పేరుతో ఓ పిల్లల సినిమా తీసిన అనుభవం ఉన్న మహేష్.. ఇప్పుడు ఓ పెద్ద హీరో రాజకీయాలపై విమర్శలు చేస్తూ మూవీ చేసేందుకు రెడీ అవుతుండగా.. పలువురు ఈ చిత్రానికి నిర్మాణం వహించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ వంటి పెద్ద హీరోలు.. రాజకీయాలపై విమర్శలు చేసే సినిమాలను చేశారంతే. ఆ తర్వాత ఏ స్టార్ హీరో కూడా అంతగా ఆసక్తి చూపలేదు.

ఇప్పుడు కూడా మహేష్ కత్తి ఓ పెద్ద హీరోతో మూవీ చేయాలని చూస్తున్నాడు. స్టార్ హీరో సెట్ అయితే మాత్రం.. ఓ బడా నిర్మాత ఈ చిత్రానికి డబ్బులు పెట్టడానికి రెడీ అన్నారట. ఒకవేళ ఆ హీరో కాదంటే మాత్రం.. కొత్తవారితో మూవీ చేయాలని భావిస్తున్నాడట మహేష్ కత్తి. అపుడు కూడా ఈ చిత్ర నిర్మాణానికి వేరే నిర్మాతలు రెడీగానే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. హీరో ఎవరైనా సరే నిర్మాతలు రెడీగా ఉండడంతో.. ప్రస్తుతం స్క్రిప్ట్ ను ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడట మహేష్ కత్తి.

కాకపోతే తనకు బాగా అచ్చొచ్చిన విమర్శలనే సబ్జెక్ట్ గా చేసుకోవడమే కాసింత ఆశ్చర్యం కలిగిస్తోందని పలువురు అంటున్నారు. మన దగ్గర న్యూస్ ఛానళ్లలో లైవ్ లో కూర్చుని ఎన్ని మాట్లాడినా చెల్లిపోతుంది. కానీ ఇవే పాయింట్స్ ను సినిమా స్క్రీన్ పై చూపించడం.. వాటిని సెన్సార్ చేయించుకోవడం అసాధ్యం అని పలువురు అనుభవజ్ఞులు తేల్చేస్తున్నారు.