Begin typing your search above and press return to search.

సీరియస్: తెరపైకి కబాలి సీక్వెల్

By:  Tupaki Desk   |   30 July 2016 6:15 AM GMT
సీరియస్: తెరపైకి కబాలి సీక్వెల్
X
మన పూరి జగన్నాథ్ తన సినిమాలు డివైడ్ టాక్ వచ్చినపుడల్లా జనాల్ని వెర్రివెంగళప్పల్ని చేసే ప్రోగ్రామ్ ఒకటి పెడుతుంటాడు. ఆ సినిమాలకు సీక్వెల్ తీయబోతున్నానని.. ఆల్రెడీ స్క్రిప్టు కూడా రెడీ అయిపోయిందని కబుర్లు చెబుతుంటాడు. సీక్వెల్ తీస్తున్నాడంటే.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అని జనాలు అనుకోవాలి.. అందులో ఏముందో చూద్దామని థియేటర్లకు వెళ్లాలన్నమాట.

బిజినెస్ మేన్.. టెంపర్.. జ్యోతిలక్ష్మీ.. ఇలా కొన్ని సినిమాలకు ఇలాంటి గేమ్స్ ప్లే చేశాడు పూరి. ఐతే నాన్న-పులి కథ లాగా ఇలాంటి కబుర్లు జనాలు ఎన్నిసార్లు నమ్ముతారు చెప్పండి. అందుకే ఇప్పుడు పూరి అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా జనాలు లైట్ తీసుకుంటున్నారు. పూరి మాత్రమే కాదు.. ఈ ‘సీక్వెల్ స్టేట్మెంట్’ స్ట్రాటజీని ఫాలో అయ్యే జనాలు ఇంకా చాలామందే కనిపిస్తుంటారు ఇండస్ట్రీలో. ‘కబాలి’ నిర్మాత కలైపులి థాను కూడా ఇప్పుడు ఇలాంటి మాటలే చెబుతున్నాడు.

చెన్నైలో ‘కబాలి’ సక్సెస్ మీట్ సందర్భంగా థాను సీక్వెల్ సంగతి ఎత్తాడు. సినిమా అద్భుతంగా ఆడేస్తోందని చెప్పిన థాను.. ‘కబాలి’ క్లైమాక్స్ విషయంలో సందిగ్ధత పెట్టడం సీక్వెల్ కోసమేనని.. ఈ విషయమై తాను.. రంజిత్ సీరియస్ గా ఆలోచిస్తున్నామని వెల్లడించాడు. ‘‘కబాలికి క్లైమాక్స్ ఓపెన్ గా ఉంచాం. నాకు.. రంజిత్ కు సీక్వెల్ మీద ఆసక్తి ఉంది. ఐతే రజినీ ఓకే చేస్తే మేం ముందుకెళ్తాం. కలెక్షన్లు ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అన్న సంకేతాల్నిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి అవకాశముంది’’ అని థాను అన్నాడు. మరి ఈ మాటలు కార్యరూపం దాలుస్తాయా.. మన పూరి కబుర్ల లాగా అవుతాయా చూద్దాం.