Begin typing your search above and press return to search.

మెగా డాటర్ కి ఆదిలోనే హంసపాదు!

By:  Tupaki Desk   |   17 Nov 2017 1:28 PM GMT
మెగా డాటర్ కి ఆదిలోనే హంసపాదు!
X
మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూతురుగా టాలీవుడ్ అరంగేట్రం చేసింది కొణిదెల నీహారిక. ఈ చిన్నదాని ఫిలిం ఎంట్రీపై మెగా ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈమె నటించిన తొలి మూవీ ఒకమనసు.. మరీ ఆఫ్ బీట్ సినిమా మాదరిగా ఉండడంతో జనాలకు పెద్దగా ఎక్కలేదు. దీంతో నీహారిక తర్వాతి సినిమా విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటోంది నాగబాబు ఫ్యామిలీ.

నీహారిక తన రెండో తెలుగు చిత్రానికి సైన్ చేసిందని కొన్ని వారాల క్రితం వార్తలు వచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొంత వరకూ జరగగా.. ఇప్పుడీ ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో దర్శకుడు మెహర్ రమేష్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన దుర్గా ప్రసాద్.. నీహారిక రెండో చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ అంతా ఓకే అనుకుంటున్న సమయంలో.. ఇక షూటింగ్ స్టార్ట్ కావడమే ఆలస్యం అనుకున్న తరుణంలో.. నిర్మాతలు చేతులెత్తేశారట. ఇందుకు కారణం.. వారికి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఎదురుకావడమే. వాటిని పరిష్కరించుకోవడం.. సినిమా నిర్మాణం ఏకకాలంలో సాధ్యం కాదని తేలిపోవడంతో.. ఈ చిత్రాన్ని రద్దు చేసుకుంటున్నట్లు నిర్మాతలు చెప్పేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం తన సెకండ్ తెలుగు మూవీ కోసం స్టోరీలు వింటున్న నీహారిక.. తమిళ్ లో మాత్రం సత్తా చాటేందుకు ప్రిపేర్ అయిపోయింది. ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్ అనే మూవీలో విజయ్ సేతుపతికి జోడీగా నీహారిక నటించగా.. రీసెంట్ గా రిలీజ్ అయిన నీహారిక పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ.. డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.