Begin typing your search above and press return to search.

తన సినిమాను పైరసీలో చూడమన్న నిర్మాత

By:  Tupaki Desk   |   21 Nov 2017 3:30 PM GMT
తన సినిమాను పైరసీలో చూడమన్న నిర్మాత
X
తన నిర్మాణంలో వచ్చిన సినిమా పైరసీ వెర్షన్ ఇంటర్నెట్లోకి వచ్చిందంటే నిర్మాత గుండెలు గుబేలుమంటాయి. తమ కష్టాన్ని దోచుకునే పైరసీ గురించి మాట్లాడితేనే నిర్మాతల మాటలు అదుపు తప్పుతాయి. కానీ తమిళ నిర్మాత ఎస్.ఆర్.ప్రభు మాత్రం పైరసీ విషయమై చాలా తాపీగా స్పందించాడు. ఓ అభిమానికి పైరసీలో సినిమా చూడమంటూ సలహా ఇచ్చాడు. ఆయన చూడమన్నది తన నిర్మాణంలో తెరకెక్కిన ‘ధీరన్ అధికారి ఒండ్రు’ సినిమాను. ఈ చిత్రం తెలుగులో ‘ఖాకి’ పేరుతో రిలీజైంది. కార్తి-రకుల్ ప్రీత్ జంటగా వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లు సాధిస్తోంది.

ఐతే ఓ విదేశీ అభిమాని.. తమ దగ్గర ‘ధీరన్ అధికారి ఒండ్రు’ రిలీజవ్వలేదని.. మరి తాము సినిమా ఎలా చూడాలని నిర్మాత ప్రభును సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. దీనికి ప్రభు స్పందిస్తూ.. 25 రోజుల తర్వాత ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైంలో పెడుతున్నామని.. అప్పటిదాకా ఎదురు చూడాలని.. లేని పక్షంలో ఇంటర్నెట్లో మంచి క్వాలిటీ ప్రింట్ వెతికి పట్టుకుని సినిమా చూడాలని షాకింగ్ సలహా ఇచ్చాడు. ఐతే పైరసీ వెర్షన్ చూశాక కష్టంలో ఉన్న ఎవరికైనా 10 డాలర్లు సాయం చేయాలని చెప్పాడు ప్రభు. ఐతే ఆ అభిమాని మాత్రం ప్రభు సలహా పాటించడానికి అంగీకరించలేదు. తాను అమేజాన్ ప్రైంలోనే సినిమా చూస్తానని అతను జవాబివ్వడం విశేషం.