Begin typing your search above and press return to search.

క‌బాలి నిర్మాత.. 300 కోట్లంటున్నాడు

By:  Tupaki Desk   |   4 May 2016 4:29 AM GMT
క‌బాలి నిర్మాత.. 300 కోట్లంటున్నాడు
X
‘క‌బాలి’ టీజ‌ర్ కు వ‌స్తున్న రెస్పాన్స్ చూశాక నిర్మాత క‌లైపులి థానుకు సినిమా మీద ఆశ‌లు.. అంచ‌నాలు భారీగానే పెరిగిన‌ట్లున్నాయి. ఈ సినిమా 300 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని ఆయ‌న బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. ర‌జినీకాంత్ గ‌త సినిమాలు విక్ర‌మ‌సింహా.. లింగా.. పెద్ద డిజాస్ట‌ర్లుగా నిలిచిన నేప‌థ్యంలో క‌బాలి మీద మొన్న‌టిదాకా పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కానీ మే 1న ఫ‌స్ట్ టీజ‌ర్ రిలీజ‌వ‌డం ఆల‌స్యం.. ఒక్క‌సారిగా ఈ సినిమా మీద అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. తెలుగు డ‌బ్బింగ్ హ‌క్కుల కోసం ఉన్న‌ట్లుండి గ‌ట్టి పోటీ నెల‌కొంది. త‌మిళంలో కూడా డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫ‌ర్లు ఇస్తున్నారు బ‌య్య‌ర్లు. ఈ నేప‌థ్యంలో సినిమా మీద అంచ‌నాలు మ‌రింత పెంచేలా స్టేట్ మెంట్లు ఇచ్చాడు క‌లైపులి థాను.

ర‌జినీ కాంత్ కెరీర్ లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో ‘క‌బాలి’ని రిలీజ్ చేస్తామ‌ని.. ఓవ‌ర్సీస్ లో సైతం రికార్డు స్థాయి రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నామ‌ని థాను చెప్పాడు. త‌మ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేయ‌బోతోంద‌ని థాను జోస్యం చెప్పాడు. ర‌జినీకి చైనాతో పాటు ఆసియా అంత‌టా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌ని.. ‘క‌బాలి’ కోసం అక్క‌డి అభిమానులంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌ని.. అందుకే చైనా స‌హా చాలా ఆసియా దేశాల్లో ఒకేసారి ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తామ‌ని థాను తెలిపాడు. పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ‘క‌బాలి’లో ర‌జినీ మాఫియా డాన్ పాత్ర పోషిస్తున్నాడు. రాధికా ఆప్టే క‌థానాయిక‌గా న‌టించింది. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు.