Begin typing your search above and press return to search.

రిలీజ్ ముందు కోమాలో నిర్మాత‌?

By:  Tupaki Desk   |   20 Jan 2019 5:43 AM GMT
రిలీజ్ ముందు కోమాలో నిర్మాత‌?
X
ఇంకో వారంలో సినిమా రిలీజ‌వుతోంది. టీమ్‌ ప్ర‌మోష‌న్స్ పీక్స్ లో ఉంది. ఈలోగానే ఈ చేదువార్త‌. ఆ సినిమాకి పెట్టుబ‌డులు పెట్టిన‌ నిర్మాత ఐసీయులో ఉన్నారు. రెండేళ్ల పాటు అహోరాత్రులు నిద్రాహారాలు మాని ఎంతో శ్ర‌మించి ఇప్పుడు ప్ర‌తిఫ‌లం అందుకునే స‌మ‌యంలో ఈ ప‌రిస్థితి ఊహించ‌నిది. కానీ త‌ప్ప‌దు.. విధి రాత‌ను ఎవ‌రూ త‌ప్పించుకోలేరు. స‌ద‌రు నిర్మాత‌కు ఊహించ‌ని విధంగా గుండెపోటు రావ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్చారు. ఇంత‌కీ ఎవారాయ‌న‌? అంటే .. `మ‌ణిక‌ర్ణిక‌- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` నిర్మాత క‌మ‌ల్ జైన్.

ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి క్రిటిక‌ల్ గానే ఉంది. ఐసీయులో వెంటిలేట‌ర్ పై కొన ఊపిరితో ఉన్నార‌న్న వార్త చిత్ర‌యూనిట్ ని క‌ల‌చి వేస్తోంది. నిర్మాత క‌మ‌ల్ జైన్ పారలిటిక్ స్ట్రోక్ కి గుర‌య్యారు. ప‌క్ష‌వాతానికి ఈ గుండె నొప్పి కార‌ణ‌మైంది. ఈ ఊహించ‌ని విప‌త్తుతో కంగ‌న స‌హా యూనిట్ కాంగారులోనే ఉన్నార‌ట‌. ఇక‌పోతే ఇంత‌టి వేద‌న‌లోనూ నిర్మాత క‌మ‌ల్ జైన్ చిత్ర‌యూనిట్ కి పంపించిన సందేశం హృద‌యాల్ని ద్ర‌వింప‌జేస్తోంది.

``రెండేళ్ల పాటు ఎంత‌గానో శ్ర‌మించాం. టీమ్ స‌భ్యులు ఎంతో క‌ష్టించారు. స‌క్సెస్‌ని ఎంజాయ్ చేయండి. సెల‌బ్రేట్ చేయండి.. ఈ స‌మ‌యంలో నేను ఆస్ప‌త్రిలో ఇలాంటి ప‌రిస్థితిలో ఉండ‌డం అంత మంచిది కాదని తెలుసు. కానీ త‌ప్ప‌దు`` అంటూ నిర్మాత జైన్ సందేశం పంపారు. కంగ‌న‌, ప్ర‌సూన్ జీ, విజ‌యేంద్ర జీ, శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్, అంకిత‌, మిస్తి .. వీళ్లంతా ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు. మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మిమ్మ‌ల్ని మిస్స‌వుతున్నా. పునీత్ గారు ఎంతో న‌మ్మి ప‌ని చేశారు. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. జీస్టూడియోస్ టీమ్, సారిక్ స‌ర్ కి థాంక్స్. సినిమాని అన్నిచోట్లా జ‌నంలోకి చేర్చారు. క‌లెక్టివ్ టీమ్ విజ‌యాన్ని ఆస్వాధించాలి. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే కోలుకుని వ‌స్తాను. జైహింద్!! అని సామాజిక మాధ్య‌మాల్లో ట్వీట్ చేశారు. రిలీజ్ ముంగిట ఏ నిర్మాత‌కు రాకూడ‌ని క‌ష్ట‌మిది. జ‌న‌వ‌రి 25న `మ‌ణిక‌ర్ణిక‌` ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది.