Begin typing your search above and press return to search.

50 మందిని పంపి ఆమెకు గుణపాఠం చెప్తా

By:  Tupaki Desk   |   17 April 2019 5:24 AM GMT
50 మందిని పంపి ఆమెకు గుణపాఠం చెప్తా
X
తమిళ చిత్ర పరిశ్రమలో మీటూ ఉద్యమ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. తమిళ లెజెండ్రీ రచయితగా పేరు దక్కించుకున్న వైరముత్తుపై సింగర్‌ చిన్మయి లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆమె ఆరోపణలపై తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరముత్తు చాలా గొప్ప వ్యక్తి, కేవలం పబ్లిసిటీ కోసమే చిన్మయి ఆయనపై ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే చిన్మయిని తమిళ సినీ పరిశ్రమ నుండి దాదాపుగా వెలి వేసినట్లుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక నిర్మాత చిన్మయిపై తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.

వైరముత్తు గురించి లేని పోని విమర్శలు చేస్తున్న ఆమెకు తగిన గుణపాఠం చెప్తానంటూ ఒక సభలో నిర్మాత కే రాజన్‌ మాట్లాడటం జరిగింది. ఆ వీడియోను చిన్మయి ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసింది. తాను వైరముత్తుపై లైంగిక వేదింపులకు సంబంధించి వ్యాఖ్యలు చేసినప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా నన్ను టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా నిర్మాత కే రాజన్‌ ఇలా మాట్లాడాడు అంటూ చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ వీడియోలో నిర్మాత మాట్లాడుతూ... వైరముత్తు గారు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ఆయన తనకంటూ గౌరవంను క్రియేట్‌ చేసుకున్న రచయిత. అలాంటి గొప్ప వ్యక్తి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడటం ఏమాత్రం సబబు కాదు. ఆయనపై లైంగిక వేదింపుల ఆరోపణలు మానుకుంటే మంచిది. ఇకపై అయినా ఆయన జోలికి వెళ్లకుండా ఉండాలని ఆమెకు చెబుతున్నాను. మళ్లీ ఆయనపై ఆరోపణలు చేస్తే మాత్రం ఆమెకు తగిన బుద్ది చెప్తాను. మా ఏరియాకు చెందిన 50 మంది మహిళలను ఆమె మీదకు పంపి ఆమెకు గుణపాఠం చెప్తానంటూ హెచ్చరించాడు. వైరముత్తు ప్రతిష్టను దిగజార్చే ఆమె గురించి అన్ని విషయాలు బయట పెడతామంటూ నిర్మాత అన్నాడు.

ఇలాంటి వారు సినిమా ఇండస్ట్రీలో ఉంటే నాలాంటి వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు, లైంగిక వేదింపులకు పాల్పడ వ్యక్తికి మద్దతుగా నిలిచిన ఇలాంటి వారిని ఏమనాలో అర్థం కావడం లేదు అంటూ చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో కూడా చిన్మయిని టార్గెట్‌ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.