ఆ కార్.. త్రివిక్రముడికా.. తారక రాముడికా..

Wed Jun 13 2018 09:56:40 GMT+0530 (IST)

సెంటిమెంట్లు.. నమ్మకాలు సినిమా ఇండస్ట్రీలో కాస్త ఎక్కువే. ఒక్కొక్కరికి ఒకో అంశంలో కలిసొస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది. అలా కొందరికి కొన్ని నెంబర్లంటే ఎక్కువ నమ్మకం. దీనినే న్యూమరాలజీ అంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ న్యూమరాలజీపై నమ్మకం ఎక్కువే. ఎన్టీఆర్ వాడే వెహికల్ కు గ్యారంటీగా అన్నీ తొమ్మిదులే ఉండేలా చూసుకుంటారు.ఎన్టీఆర్ ప్రస్తుతం రేంజ్ రోవర్ కారు వాడుతున్నాడు. ఇది ఎన్టీఆర్ మామ గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ కారును ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో రిజిస్టర్ చేయించారు. ఈ కారు నెం. 9999. ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా రాధాకృష్ణ రూ. 1.3 కోట్లు ఖర్చు పెట్టి ఓ రేంజి రోవర్ కొన్నారు. వేలంలో రూ. 10 లక్షలకు పైగా ఖర్చు పెట్టి దీనికి కూడా 9999 నెంబరు సంపాదించారు.

ఇప్పుడు రాధాకృష్ణ ఇంత ఖర్చుపెట్టి ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టమైన ఫ్యాన్స్ నెంబర్ వేలం సొంతం చేసుకుని మరీ కొన్నది ఈ కారును ఎన్టీఆర్ కు గిఫ్ట్ చేయడానికే అని కొందరు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఇది త్రివిక్రమ్ కు ఇవ్వబోతున్న బహుమతి అని మరికొందరు అంటున్నారు. మరి దీని ఓనర్ ఎవరో అన్నది ఇంకా కన్ఫర్మ్ గా తెలియలేదు. ఆ రేంజ్ రోవర్ త్రివిక్రముడికా.. తారక రాముడికా అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే