Begin typing your search above and press return to search.

అంత సెక్సీగా జెండా పట్టుకుంటావా?

By:  Tupaki Desk   |   15 Aug 2017 8:38 AM GMT
అంత సెక్సీగా జెండా పట్టుకుంటావా?
X
ఇండిపెండెన్స్ డే అంటే మన దేశం మొత్తం జరుపుకునే ఏకైక పండుగ. ఈ రోజునాడు ఎవరు దేనికి చెందిన వారైనా ఎవరైనా ఒకేలా జరుపుకుంటారు ఒకటే కోరుకుంటారు. ఎప్పుడైనా అందరూ ఒకలా చెబితే మన స్టార్ హీరోయిన్లు మాత్రం కొంచం కొత్తగా చెబుతారు కదా. దేశం పై భక్తిని చెప్పడంలో కూడా వీళ్ళు వాలా అందాన్ని బాగనే వాడతారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇండియాలో లేదు తన హాలీవుడ్ సినిమా షూటింగ్లు కోసం అమెరికాలో ఉంది. అందుకని ఆమె తన ఇండిపెండెన్స్ డే విషెస్ ని ఇలా అందాలు వలకబోస్తూ చెబుతుంది.

హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెబుతూ నా గుండె ఎప్పుడు ఇండియాలోనే ఉంటుంది అని తన భావాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది సెల్ఫీ యుగం కాబట్టి ఎవరుకి నచ్చిన విదానంలో వాళ్ళు ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రియాంక కూడా ఇక్కడ ఒక సెక్సీ వైట్ టాప్ వేసుకొని దానిపై మన దేశ త్రివరణంలో ఉండే రంగుల దుప్పటాను మెడలో వేసుకొని జై హింద్ అంటుంది. అయితే అమ్మడు ఆనందం అందరికీ అర్ధమైనా.. ఇంత సెక్సీగా కనిపిస్తూ.. జెండాను మెడలో వేసుకుంటావా? అంటూ జనాలు బూతులు తిడుతున్నారు. ఈమెకు వివాదాలు కొత్త కాదుగా అని కూడా కొంతమంది ఆ వెంటనే కామెంట్లు కూడా పెట్టారు. దేశంకు వందనం చేసే పద్దతి ఇదేనా అని మరికొంతమంది అంటున్నారు. తన ఫోటో కి ఇలాంటి స్పందన వచ్చింది ఏంటి అని తెగ ఫీల్ అవుతుంది ప్రియాంక. పాపం ఈ మధ్య ప్రియాంక ఏమి చేసిన ఏమి మాట్లాడినా అది వివాదంగానే మారుతుంది.

బేవాచ్ సినిమా తరువాత మరో రెండు హాలీవుడ్ సినిమాలలో ఆఫర్లు పట్టేసిన ప్రియాంక ఈ ఏడాది అంతా హాలీవుడ్ లోనే ఉంటుందిని తెలుస్తోంది. ఇప్పుడు అయితే ‘ఇజ్ఇంట్ ఇట్ రొమాంటిక్’ అనే సినిమా షూటింగ్ తో బిజీ గా ఉంది. ప్రియయాంక చోప్రా యాక్టింగ్ తో బిజీ గా ఉంటూనే కొన్ని మనదేశ ప్రాంతీయ చిత్రాలకు నిర్మాతగా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో కూడా ఒక టి‌వి షో కి ప్రొడ్యూస్ చేయబోతుంది అని తెలుస్తోంది.