ఫోటో స్టొరీ: అబ్బా..చంపేసిందిగా!

Mon Jan 21 2019 17:41:07 GMT+0530 (IST)

ప్రియాంక జవాల్కర్ పేరు తెలుసుగా..? మీకు తెలుసో లేదోగానీ 'టాక్సీవాలా' చూసిన వారికి మాత్రం తెలుసు.  ఆ సినిమాలో అమ్మడి అందానికి ఫ్లాట్ అయిపోయిన విజయ్ దేవరకొండ సిడ్ శ్రీరామ్ సహాయంతో 'మాటే వినదుగ వినదుగ' అంటూ ఒక సూపర్ హిట్ పాటేసుకోవాల్సి వచ్చింది.  ఈ బ్యూటీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.ఫోటోకు క్యాప్షన్ ఏంటంటే "ఏం లేదు.. జస్ట్ రోడ్ దాటుతున్నా".    నిజమే ఆమెకేం ఉండదు. చూసిన వాళ్ళు కదా చచ్చేది!   నల్లచీర.. ఉల్లిపొర లాంటి నల్లచీర. రెడ్ కలర్ జాకెట్. ఏమాత్రం అసభ్యంగా లేని అందమైన.. సంప్రదాయ వస్త్రధారణ. కాకపోతే కొంటె కోణంగుల కళ్ళన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్ళలాగే ఉంటాయి కదా! మధ్యలో పవర్ స్టార్ ఎందుకు వచ్చాడని చిరాకు పడకండి. అయన 'ఖుషి'లో అక్కడ చూసినందుకేగా గొడవ వచ్చింది. ఇప్పుడు అందరూ పవన్ సారులాగే అక్కడ చూడక తప్పేలా లేదు.. రైల్వే స్టేషన్ లో  'అపాయం 10000 వోల్టులు' ఉంటుంది కదా.  ఆ రేంజ్ షాకు తగిలినట్టు ఇప్పుడు నెటిజనులు గిలగిలా కొట్టుకునేలా ఉన్నారు!

స్వతహాగా మరాఠి కుటుంబానికి చెందిన అమ్మాయి అయిన ఈ భామ అనంతపూర్ నుండి రావడంతో తెలుగు అమ్మాయి అనే అనుకోవచ్చు.  రంభ ఊర్వసి మేనక పేర్లు రెగ్యులర్ అయిపోయాయి కాబట్టి అనంతపూర్ తిలోత్తమ అని పిలుచుకుందాం.  అప్సరసలకు కాకపోతే మానవ మాత్రులకు ఇలాంటి అందం ఉంటుందా? ఈ భామ 'టాక్సీవాలా' తర్వాత రవితేజ సినిమా 'డిస్కో రాజా' లో హీరోయిన్ గా నటించనుందట.