Begin typing your search above and press return to search.

24తో 100 కోట్లు.. దటీజ్ ప్రియాంక

By:  Tupaki Desk   |   25 May 2016 1:30 PM GMT
24తో 100 కోట్లు.. దటీజ్ ప్రియాంక
X
అదేంటీ 24 మూవీతో ప్రియాంకకు సంబంధం ఏంటి? సూర్య చేసిన 24 మూవీకి వంద కోట్ల కలెక్షన్స్ వస్తే దటీజ్ ప్రియాంక అని ఎందుకనాలి అనిపిస్తుంది కానీ.. ఆ 24.. ఈ 24 వేరు. ప్రస్తుతం అమెరికాలోనే సెటిల్ అయిపోయింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు ఇండియా టూర్ ప్లాన్ చేసుకుని వస్తోంది.

ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా.. ఖచ్చితంగా 40 రోజులు. క్వాంటికో సీరియల్, హాలీవుడ్ మూవీ బేవాచ్.. ఇన్నింటిలో బిజీగా ఉన్నా.. పీసీ ఇప్పుడెందుకు ఇండియాకి వస్తోందో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. చాలా రోజులనుంచి ఇక్కడ లేదు కాబట్టి.. ఇండియాపై బెంగ పెట్టుకుందేమో అనుకోవచ్చు కానీ.. అది కూడా కరెక్ట్ కాదు. ఫుల్ ప్లెడ్జెడ్ గా కమర్షియల్ యాంగిల్ లోనే తన ఇండియా టూర్ ప్లాన్ చేసింది ప్రియాంక. ఇక్కడుండే ఈ 40 రోజుల్లో 24 యాడ్స్ షూటింగ్ లో పాల్గొననుంది అమ్మడు.

ఓ ఫ్రూట్ డ్రింక్ - గోల్డ్ జ్యూవెల్రీ - ఎయిర్ లైన్స్ కంపెనీ - పాన్ మసాలా.. ఇలా మొత్తం 24 కంపెనీలకు సంబంధించిన యాడ్స్ షూటింగ్ పాల్గొననుంది. ఈ ప్రకటనల ద్వారా పీసీ సంపాదించే మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా వంద కోట్లు. అలా ఈ 40 రోజుల్లో.. 24 ప్రకటనలతో వంద కోట్లు సంపాదించేయనుంది ప్రియాంక. బాగుంది కదూ అమ్మడి టూర్. అంటే ప్రియాంక ఈ టూర్ లో ఒక్క రోజు సంపాదన అక్షరాలా రెండున్నర కోట్ల రూపాయలన్న మాట.