ఏజ్ తక్కువ ప్రియుడితో చెట్టాపట్టాల్

Sat Jun 23 2018 11:37:57 GMT+0530 (IST)

బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా కూడా ప్రియాంక చోప్రా స్థాయిలోఎవరు క్రేజ్ అందుకోలేదనే చెప్పాలి. అతి తక్కువ కాలంలో ఎక్కువగా ఫెమస్ అయిన బ్యూటీల లిస్ట్ తీస్తే అందులో ప్రియాంక నేమ్ ఉంటుందని చెప్పవచ్చు. హాలీవుడ్ వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించిన ఈ మగువ ఇప్పుడు పెళ్లి వైపు అడుగులు వేస్తోంది. ఎంతో మంది కుర్రాళ్ళ మనసును దోచుకున్న ప్రియాంక హాలీవుడ్ కుర్రాడికి పడిపోయిన సంగతి తెలిసిందే.25 ఏళ్ల వయసున్న యంగ్ మ్యూజిషియన్ నిక్ జోనస్ తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ 35 ఏళ్ల బేబీ ఇటీవల ముంబై కి తీసుకు వచ్చింది. కుటుంబ సబ్యులకు పరిచయం చేయించాలని ప్రియాంక ఎప్పటి నుంచొ ట్రై చేస్తోంది. ఫైనల్ గా ఇప్పుడు కెరీర్ పరంగా కాస్త రెస్ట్ దొరకడంతో సినిమాలను పక్కనపెట్టి కేవలం పెళ్లిపై ద్రుష్టి పెట్టింది. ఇక నిక్ కు ముంబై నగరాన్ని అమ్మడు బాగానే అలవాటు చేస్తోంది. రీసెంట్ గా కెమెరాకు చిక్కిన ఈ జంట అందరిని ఆకట్టుకున్నారు.

ప్రియాంక అయితే ఎప్పటిలానే గ్లామర్ గర్ల్ గా మెరిసిపోగా ఆమె బాయ్ ఫ్రెండ్ కూల్ గా అమ్మడి చేయి పెట్టుకొని అడుగులు వేస్తున్నాడు. అందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీడియా వారిని ఎక్కువగా ఫోకస్ చేసినప్పటికీ ప్రియాంక ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా సింపుల్ స్టిల్స్ ఇచ్చేసింది. ఇక ప్రస్తుతం నిశ్చితార్థం కోసం కార్యక్రమాలు జరుగుతున్నాయని.. అందుకే ఇలా ముంబైలో చెట్టాపట్టాల్ అంటూ వీళ్ళు చిలకా గోరింకల్లా చెక్కెర్లు కొడుతున్నారని బాలీవుడ్ లో ఒక టాక్ అయితే వస్తోంది.