Begin typing your search above and press return to search.

హాలీవుడ్ ప్రియాంక ఇలా ఉంటుంది..

By:  Tupaki Desk   |   23 Feb 2017 5:01 PM GMT
హాలీవుడ్ ప్రియాంక ఇలా ఉంటుంది..
X
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో కూడా ఫుల్లు బిజీబిజీగా గడిపేస్తోంది. క్వాంటికో టీవీ సిరీస్.. బేవాచ్ మూవీ.. బోలెడన్ని ఫోటో షూట్స్.. సెలబ్రిటీ షోలలో ఇంటర్వ్యూలు.. పీసీ అసలెక్కడా తగ్గడం లేదు. సీరియల్ తోనే బోలెడంత ఇమేజ్ సంపాదించుకున్న పిగ్గీ ఛాప్స్ .. ఇప్పుడు తను నటించిన మొదటి సినిమా బేవాచ్ ప్రమోషన్స్ ని కూడా బాగానే హ్యాండిల్ చేసేస్తోంది.

బేవాచ్ మూవీలో తన కేరక్టర్ కి సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేసిన ప్రియాంక.. రెడ్ కలర్ డ్రెస్ లో భలే మెరిసిపోయింది. బీచ్ ఒడ్డున అందాలను ఒలికిస్తూ తన స్టైల్ స్టేట్మెంట్ బాగానే ఇస్తోంది. 'బ్యాడ్ గా ఉండడం కూడా చాలా మంచిదే కావచ్చు' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా పెట్టింది పీసీ. బీచ్ బేబ్స్ అండ్ యాక్షన్ కి పేరెన్నిక టీవీ సిరీస్ ని సినిమాగా మలుస్తుండగా.. ఇందులో విక్టోరియా లీడ్స్ అనే నెగిటివ్ రోల్ చేస్తోంది పీసీ. ఆ పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టరే ఇది.

మే 26న విడుదల కానున్న బేవాచ్ మూవీపై పీసీ చాలానే హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే.. ప్రస్తుతం హాలీవుడ్ లో ఈ బ్యూటీ పరిస్థితి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది కానీ.. అంత సాఫీగా లేదు. క్వాంటికో సిరీస్ ని ఇక కొనసాగించక పోవచ్చనే టాక్ ఉండడంతో.. ఇప్పుడీ బేవాచ్ తో సక్సెస్ కొట్టడం ప్రియాంకకు చాలా అవసరం. అందుకే బ్యాండ్ లో కూడా ఆనందం వెతుక్కుంటోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/