Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మరోసారి దారపోసింది

By:  Tupaki Desk   |   25 July 2017 10:23 AM GMT
ఫోటో స్టోరి: మరోసారి దారపోసింది
X
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా తన హాలీవుడ్ షూటింగ్ షెడ్యూల్ తో బాగ బిజీ గా ఉంది. ఏ రోజు విహారానికి వెళ్తుందో ఎక్కడ షూటింగ్ చేస్తుందో అర్ధం కావటం లేదు ఆమెను ఫాలో అవుతున్న మీడియా వాళ్ళకి. ఇంత బిజీ లోనూ అప్పుడు అప్పుడు ముంబాయి కి వచ్చి ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని కలిసి వెళ్తుంది. కొద్ది రోజులు కిందట ప్రియాంకా 'ఈజింటిట్ రొమాంటిక్' సినిమా షూటింగ్ లో ఒక యాక్టర్ వెనుకనుండి హగ్ చేసుకున్న ఫోటోలతో రచ్చలేపేసింది. ఇప్పుడు కూడా అలాంటి ఫీటే చేస్తోంది.

ఇది రొమాంటిక్ కామిడీ సినిమా కావడంతో ప్రియాంకా ఈ సినిమాలో తన అందాలుకు మంచి పనే పెట్టినట్లు అనిపిస్తోంది. డేటింగ్ సీన్లు లవ్ సీన్లు బాగానే ఉండటంతో.. ఇక్కడ పొట్టి గౌన్ లో ప్రియాంకాను చూస్తే అందంతో పాటుగా స్టైలిష్ గా ఉందని అర్ధంచేసుకోవచ్చు. పూల గౌన్ వేసుకొని ఇలా రోడ్ పై కనిపించింది. ఈ అవతారంలో అసలు ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోండి. మొదటి హాలీవుడ్ సినిమాలో బికినీలుతో అందరినీ తన అందంతో అలరిస్తే ఇప్పుడు పొట్టి పొట్టి గౌన్లు వేసుకొని ముద్దుగా మురిపిస్తోంది. సరదాగా సాగే ఈ సినిమాలో ప్రియాంకా కామిడీ టైమింగ్ అదిరిపోయేలా ఉండబోతుంది అని టాక్.

బేవాచ్ సినిమా ప్రమోషన్ టైమ్ లో ఎదుర్కొనే విమర్శలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటుంది ప్రియాంక. అసలే ఆమె డ్రస్సులపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తన ఫ్యాషన్ పై విమర్శలు వస్తున్నాయి. ఏవి ఎలా ఉన్న ప్రియాంక మాత్రం ఇలా తన అందాలను దారబోయడంలో ఆరితేరిపోయిందంతే.