Begin typing your search above and press return to search.

ప్రెసిడెంట్ డిన్నర్ కి పీసీ అలా వెళ్లిందా

By:  Tupaki Desk   |   2 May 2016 7:31 AM GMT
ప్రెసిడెంట్ డిన్నర్ కి పీసీ అలా వెళ్లిందా
X
ప్రెసిడెంట్ డిన్నర్ లో ప్రియాంక షాక్!! బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కొన్నాళ్ల క్రితం అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా నుంచి డిన్నర్ ఆహ్వానం వచ్చింది. ఇలా అమెరికా ప్రెసిడెంట్ నుంచి డిన్నర్ ఇన్విటేషన్ అందుకున్న అరుదైన వ్యక్తుల్లో ప్రియాంక చోటు సంపాదించింది. టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో పేరు తర్వాత.. పీసీకి ఈ పిలుపు వచ్చింది.

అమెరికా ప్రెసిడెంట్ తో డిన్నర్ అంటే ఖచ్చితంగా అది అతి పెద్ద గౌరవమే. సాధారణంగా ఇలాంటి డిన్నర్ లకు.. ఎంతటి గ్లామర్ హీరోయిన్లు అయినా చాలా పద్ధతిగా డ్రస్ చేసుకుని వెళుతూ ఉంటారు. ఇది ఆనవాయితీ. కానీ ఈ ట్రెండ్ కు పీసీ బ్రేక్ వేసేసింది. బ్లాక్ డ్రస్ లో కంప్లీట్ క్లీవేజ్ ను చూపించేస్తూ అందాలను ప్రదర్శించేసింది. ఇప్పటివరకూ ప్రియాంక ఆరేసిన అందాలతో పోల్చితే.. ఇదే మాగ్జిమమ్ అనాలి. ఆ రేంజ్ లో సోయగాలను ప్రదర్శనకు పెట్టింది. ఒక ట్రెండ్ ను, ఆనవాయితీని బ్రేక్ చేస్తూ.. ప్రియాంక ఈ రేంజ్ లో డ్రెసింగ్ చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.

అయితే.. ఈ డ్రసింగ్ విషయంలో వ్యక్తిగత హద్దులే తప్ప.. ఇలాగే ఉండాలనే రూల్స్ ఏమీ లేవు కాబట్టి.. ప్రియాంక చర్యను ఎవరూ తప్పు పట్టడం లేదు. కాకపోతే.. ఈ రేంజ్ అందాల ఆరబోత, అది కూడా అమెరికా ప్రెసిడెంట్ డిన్నర్ లో కరెక్ట్ కాదేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక మాత్రం ఈ విషయంలో మాత్రం తగ్గకపోవడం విశేషం