ప్రియాంక కొత్త పోస్టర్.. కాపీయేనా!!

Thu Apr 20 2017 13:03:24 GMT+0530 (IST)

మన ఇండియన్ దేశి  గర్ల్ అయ్యుండీ.. హాలీవుడ్ లో కూడా మంచి సెక్సీ అండ్ స్పయిసీ నటి గా పేరు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. ‘బేవాచ్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్ తో అమ్మడు అక్కడి సినిమాల్లోకి అడుగపెడుతోంది. ఈ సినిమా లో ప్రియాంక ఒక కీలకమైన నెగెటివ్ పాత్ర పోషించింది. ఎప్పటి నుండో వినిపిస్తున్న ఈ సినిమా తాలూకు తొలి మూవీ పోస్టర్ ని ఎట్టకేలకు రిలీజ్ చేశారు.

ఇంతకు ముందు వచ్చిన ఈ సినిమా ప్రోమో లో ప్రియాంక ఎక్కడ కనిపించలేదు. దీనితో మన దేశి అభిమానులు కొంచం నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు బేవాచ్ టీం ఒక పోస్టర్ ని విడుదల చేసారు.ఆ పోస్టర్ లో ప్రియాంక ముఖం క్లోజప్ ఉండగా.. ఆమె పెట్టుకున్న మిర్రర్ ఏవియేటర్ సన్ గ్లాస్సెస్ లో ఆ మూవీ లో ఉన్న పాత్రలు కొన్ని కనిపిస్తాయి.ఈ పోస్టర్ లో ప్రియాంక చాల సెక్సీ లుక్ తో అందరిని ఆకట్టుకుందనే చెప్పాలి. కాకపోతే అసలు విషయం ఎంటిటంటే ఈ సినిమా పోస్టర్ ఒక ఫేమస్ ఇంగ్లీష్ మూవీ పోస్టర్ కు మక్కికి మక్కీ దించిన కాపీలా కనిపించింది.

కేట్ హడ్సన్ నటించిన 'ఆల్మోస్ట్ ఫేమస్' అనే సినిమా 2000 లో వచ్చింది. ఆ సినిమా పోస్టర్లో కేట్ హడ్సన్ కూడా ఏవియేటర్ సన్ గ్లాస్సెస్ పై ఆ సినిమా పేరుండి  దాని నీడ లో ఆ సినిమా కు సంబంధం ఉన్న కొన్ని సన్నివేశాలు ఉంటాయీ. ఇది నిజంగేనే యాధృచ్ఛికమా లేక కాపీ నా అనీ తెలియటంలేదు. మన బాలీవుడ్డులోనే కాపీ గీపీ అని ఇన్నాళ్ళూ అనుకున్నాం కానీ అందరు అంతే అంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/