Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎక్కడకొచ్చినా.. ఇదే రచ్చ!!

By:  Tupaki Desk   |   23 May 2016 7:30 PM GMT
ఫోటో స్టోరి: ఎక్కడకొచ్చినా.. ఇదే రచ్చ!!
X
ఈ మధ్యకాలంలో అమెరికాలో ఏ ఈవెంట్‌ జరిగినా చాలు.. మన భామ మాత్రం ఒకే చందంగా వచ్చేస్తోంది. ప్రతీసారి అదే రేంజు అందచందాల ఆరబోతతో అక్కడి మీడియావారిని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఇండియన్ బ్యూటీలందరూ కాస్త డిఫరెంటుగా ఉంటారుగా.. మరి ఈ అమ్మడు మాత్రం ఎందుకు ఇలా రెచ్చిపోతోంది అంటూ అమెరికన్‌ మీడియా డిస్కస్‌ చేసుకోవడం విశేషం.

నిన్న అమెరికాలో బిల్‌ బోర్డ్‌ మ్యూజిక్ అవార్డులకు విచ్చేసిన సెక్సిణి ప్రియాంక చోప్రా.. అక్కడ రెడ్‌ కార్పెట్‌ పై బ్లూ కలర్‌ డ్రస్సులో మతి పోగొట్టేసిందంతే. ఈ మధ్యన ఏబిసి ఈవెంట్లోనైనా.. టైమ్‌ మ్యాగజైన్‌ ఈవెంట్లో కానివ్వండి.. లేదా ఆస్కార్‌ అవార్డుల దగ్గరైనా.. అమ్మడు క్లీవేజ్ కనిపించేలా తెగ చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ కూడా అంతే.. నీలి రంగు వెర్సేస్‌ గౌనులో బ్యాక్‌ లెస్‌ అందాలతో ఒక ప్రక్కనా.. మరో ప్రక్కన ఆ లో-నెక్‌ డ్రస్సులో తన సోకుల సోయగాల కిక్కులో.. ఉతికి ఆరేసింది. అసలు ఎక్కడకొచ్చినా ఇదే రచ్చ ఎందుకు ప్రియాంక?

నిజానికి హాలీవుడ్‌ లో నెట్టుకురావాలంటే.. ఏదో ఒకటి చేయాలి మరి. అందుకే అమ్మడు ప్రతీసారి ఇలా అందాలు కుమ్మరిస్తే అక్కడి పి.ఆర్‌. ఏజన్సీలన్నీ ఈమెను మర్చిపోవుగా!! ఆ విధంగా మరిన్ని ఆఫర్లు తన చేతిలో పడే ఛాన్సుంటుంది. అందుకే ఈ వేషాలన్నీ.