Begin typing your search above and press return to search.

జాకెట్ చెప్పిన ప్రియాంక ప్రేమ గుట్టు

By:  Tupaki Desk   |   28 May 2017 7:19 AM GMT
జాకెట్ చెప్పిన ప్రియాంక ప్రేమ గుట్టు
X
ప్రియాంక చోప్రా- షారూక్ ఖాన్ ల మధ్య అప్పట్లో లవ్ స్టోరీ నడిచేసేదని ఓ టాక్ ఉండేది. దాని గురించి ఎప్పుడూ ఎవరూ పైకి చెప్పుకోలేదు కానీ.. తాజాగా ప్రియాంక చెప్పిన ఓ జాకెట్ కహానీ.. ఆ తర్వాత ట్విట్టర్ సాక్షిగా రియాక్షన్ కారణంగా.. షారూక్ ని తన మాజీ అని పీసీ ఒప్పుకుందా అనిపించేస్తోంది.

బేవాచ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనేక యాక్టివిటీస్ చేపడుతున్న ప్రియాంక.. తాజాగా డర్టీ లాండ్రీ అనే ఓ టీవీ షోకి హాజరైంది. ఈ కార్యక్రమానికి ఓ బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకుని వచ్చిన ప్రియాంక.. షో టైటిల్ తగినట్లుగా ఈ పాత జాకెట్ తో వచ్చానని చెప్పింది. అయితే.. ఈ షోని నిర్వహిస్తున్న హోస్ట్.. జాకెట్ గురించి చెప్పమని అడిగినపుడు.. 'ఇది నా మాజీ బాయ్ ఫ్రెండ్ ది. విడిపోయినపుడు ఇది మాత్రం నా దగ్గర ఉండిపోయింది. నా దగ్గరే ఉన్న దీన్ని నా వస్తువుగానే భావించా. ఎయిర్ పోర్ట్స్ వంటి వాటిలో బాగా ఉపయోగపడుతుంది' అని చెప్పింది ప్రియాంక చోప్రా.

అయితే.. ఈ డీటైల్స్ ను బేస్ చేసుకుని షారూక్ ఖాన్ గురించే ప్రియాంక ఈ కామెంట్స్ చేసిందంటూ ఓ ఫ్యాన్ ట్విట్టర్ లో ట్వీట్ చేయగా.. ఆ పోస్ట్ ను మొదట లైక్ చేసిన పీసీ.. తర్వాత అన్ లైక్ చేసేసింది. అదే విషయాన్ని చెప్పిన ఆ ఫ్యాన్.. అసలేం జరుగుతోందంటూ క్వశ్చన్ చేయడంతో.. షారూక్- ప్రియాంకల అప్పటి ప్రేమ వ్యవహారం హాట్ న్యూస్ ఇప్పుడు హాట్ న్యూస్ అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/