ప్రియాంక చోప్రా బ్యాగ్ ధర ఎంతో తెలుసా?

Thu Jun 14 2018 15:54:10 GMT+0530 (IST)

హాలీవుడ్ మూవీ ‘క్వాంటికో’ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఇప్పుడామెకు హాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పరిచయాలు పెరిగి హాలీవుడ్ నటుడినే బాయ్ ఫ్రెండ్ గా ఎంచుకొని ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ప్రేమలో మునిగితేలుతున్న ప్రియాంక చోప్రా అతడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడం కనిపిస్తోంది. ఇటీవలే నిక్ బంధువుల పెళ్లిలో ప్రియాంక-నిక్ జోనాస్ చేసిన రోమాన్స్ చూసి వీరు గాఢ ప్రేమలో ఉన్నట్టు అందరికీ అర్థమైంది.తాజాగా వీరిద్దరూ అమెరికాలోని న్యూయార్స్ లో సందడి చేశారు. ఓ రెస్టారెంట్ లో ఇద్దరూ డిన్నర్ చేసి బయటకు వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఫొటోలో ఉన్న ప్రియాంక బ్యాగ్ పైనే పడింది. వెరైటీ డిజైన్ తో చూడడానికి కొత్తగా ఉన్న ఆ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ఆ బ్యాగ్ ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ బ్యాగ్ ధర దాదాపు 4.6 లక్షల రూపాయలు అట. ఈ ధరతో ఏకంగా ఓ టియాగో కారు కూడా కొనేయవచ్చు. దీంతో ఈ జంట ప్రేమలో మునిగి విలాసంగా ఎంజాయ్ చేస్తున్నట్టు అర్థమవుతోంది.