Begin typing your search above and press return to search.

అందాన్ని అందంగా ప్రెజంట్ చేసింది

By:  Tupaki Desk   |   19 May 2018 4:55 PM GMT
అందాన్ని అందంగా ప్రెజంట్ చేసింది
X
బాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా స్టైల్ లో గత కొంత కాలంగా చాలా మార్పులు వస్తున్నాయి. ఆమెను ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అనాలా లేక హాలీవుడ్ బ్యూటీ అనాలా అర్థం కావడం లేదు. కేవలం స్టైల్ లోనే కాకుండా అమ్మడు విదేశి తారలతో మంచి స్నేహాన్ని కూడా పెంచుకుంది. చాలా వరకు తనతో నటించిన హాలీవుడ్ స్టార్స్ తో ఈ బ్యూటీ రిలేషన్ ని పెంచుకుంటోంది. అవకాశాలు ఎంత వరకు వస్తున్నాయో గాని స్నేహాలు మాత్రం ప్రియాంకకు బాగానే వస్తున్నాయి.

తనకు హాలీవుడ్ లో బాగా దగ్గరైన ఫ్రెండ్ మెగాన్ మార్క్ పెళ్లి సందర్భంగా అమ్మడు స్పెషల్ గెస్ట్ గా వెళ్లింది. శనివారం జరిగిన ఆ రాయల్ వెడ్డింగ్ లో చాలా మంది సెలబ్రిటీలు దర్శనం ఇచ్చారు. అయితే అందరికంటే డిఫరెంట్ గా కనిపించింది మాత్రం ప్రియాంకనే.. అమ్మడు అక్కడి స్టైల్ నే ఫాలో అయ్యి సరికొత్తగా కనిపించింది. వివియన్నే వెస్ట్ వుడ్ సింగిల్ బ్రెస్ట్ బ్లేజర్ - పెన్సిల్ స్కర్ట్ మరియు ఒక ఫాసినిటర్ టోపీతో కనిపించిన ప్రియాంక అందరిని ఆకర్షించిందనే చెప్పాలి.

చెవి పోగు నుంచి అరి కాలి నెయిల్ పాలిష్ వరకు ప్రియాంక తన అందాన్ని చాలా అందంగా ప్రజెంట్ చేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ క్వీన్ లా ఉందని ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని కూడా మరికిందరు ప్రశంసలను అందిస్తున్నారు.