Begin typing your search above and press return to search.

హోల్ సేల్ కాంట్రాక్ట్ ఇచ్చేసిందేమో

By:  Tupaki Desk   |   28 Sep 2016 3:30 PM GMT
హోల్ సేల్ కాంట్రాక్ట్ ఇచ్చేసిందేమో
X
ప్రియాంక చోప్రా టైమ్ ఇప్పుడు భేషుగ్గా నడుస్తోందనే విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఎనలేని క్రేజ్ సంపాదించుకుని హాలీవుడ్ లో పాతుకుపోయింది కూడా. ఇప్పటికే మకాం కూడా అమెరికాకి మార్చేసిన ఈ భామ.. రీసెంట్ గానే స్టార్ట్ అయిన క్వాంటికో సీజన్2లో రెచ్చిపోయి మరీ నటిస్తోంది. హాలీవుడ్ లో ప్రైమ్ టైమ్ టీవీ సిరీస్ లో లీడ్ రోల్ చేసిన మొట్టమొదటి ఇండియన్ గా రికార్డు సృష్టించిన ప్రియాంక.. ఓ విషయంలో మాత్రం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

క్వాంటికో2 ప్రీమియర్ సందర్భంగా.. ఇంటర్వ్యూ అనే మేగజైన్ కు ఫోటో షూట్ చేసింది ప్రియాంకా చోప్రా. తను క్వాంటికోలో చేసిన అలెక్స్ పాత్రకు.. బేవాచ్ మూవీలో చేస్తున్న విక్టోరియా రోల్ కు చాలా తేడా ఉందన్న ఈ బ్యూటీ.. తాను రియల్ లైఫ్ లో కూడా అలాగే ఫీలయినా.. కొంచెం తేడా ఉంటుందని చెప్పింది. యథావిధిగా కొన్ని కలర్ ఫుల్ ఫోటోలు.. కొన్ని డిఫరెంట్ గెటప్పులు.. మరికొన్ని సోయగాలను చూపించే చిత్రాలు ఉన్నాయి.

గత 3-4 నెలల్లో ఎన్ని కవర్ పేజ్ లపై కనిపించావ్ పీసీ అని అడిగితే.. ఆమె అభిమానులే కాదు.. ప్రియాంక చోప్రా కూడా టక్కుమని చెప్పడం కష్టం. ఆ రేంజ్ లో హాలీవుడ్-బాలీవుడ్ మేగజైన్స్ అన్ని కవర్ పేజ్ లను కవర్ చేసేస్తోంది ప్రియాంక. చూస్తుంటే.. అక్కడి కెళ్లి మొత్తం మేగజైన్స్ అన్నిటికీ హోల్ సేల్ గా ఏదో మాట్లాడేసుకుందేమో అనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/