Begin typing your search above and press return to search.

అమెరికాలో దేశాన్ని డిపెండ్ చేస్తోంది

By:  Tupaki Desk   |   1 Dec 2015 5:33 AM GMT
అమెరికాలో దేశాన్ని డిపెండ్ చేస్తోంది
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా` క్వాంటికో ` షోతో ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిపోయింది. ప్ర‌స్తుతం ప్రియాంక అమెరికాలో కొన్ని మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తోంది. అయితే అలా లైవ్ ప్రోగ్రామ్స్‌ కి వెళ్లిన‌ప్పుడు త‌న‌కి కొన్ని ఠిఫిక‌ల్ క్వ‌శ్చ‌న్స్ త‌గిలాయి. ఇండియాలో ఆడాళ్లంతా రేప్‌ల‌కు గుర‌వుతున్నార‌ట క‌దా అంటూ వింతైన ప్ర‌శ్న‌లెన్నో ఎదుర‌య్యాయి. వాట‌న్నిటికీ స‌మాధంన చెప్పుకోవ‌డానికి త‌నకి త‌ల కొట్టేసినంత ప‌నైంద‌ని చెబుతోంది.

అయితే ఇండియాని డిపెండ్ చేయ‌డానికి తిరిగి త‌ను కూడా కౌంటర్లు వేశాన‌ని చెప్పింది. అస‌లింత‌కీ ఇండియాలోనే రేప్ ల గురించి ప్ర‌స్థావించిన స‌ద‌రు చానెల్ వారికి ప్రియాంక ఏం స‌మాధానం ఇచ్చిందో తెలుసా? ఆడాళ్ల‌పై ఒక్క ఇండియాలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటి ఘాతుకాలు జ‌రుగుతున్నాయి. ఇండియా పేరు ఎందుకు ప్ర‌స్థావిస్తారు. ప్ర‌పంచంలో టాప్ -5 రేపిస్ట్ కంట్రీస్ గురించి చెప్ప‌మంటారా? అంటూ తిరిగి ప్ర‌శ్నించింది. సూప‌ర్బ్ ప్రియాంక ప‌రువు నిల‌బెట్టావ్‌.

ఇప్పుడు మ‌న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం ఏంటి? దేశాన్ని ఏలుతున్న ఏలిక‌లు సైతం ఈ ఇన్సిడెంట్‌ ని గుర్తించాలి. రేప్‌ ల‌లో ఇండియా ఎంత‌గా పాపుల‌ర్ అవుతోందో గ‌మ‌నించి మునుముందు ప‌రువు మిగుల్చుకునేలా మ‌న పోలీస్ వ్య‌వ‌స్థ‌ని, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ని తీర్చిదిద్దుతారేమో చూడాలి.