Begin typing your search above and press return to search.

నిక్ జోనాస్ లేకుండా ఒక్కతే ముంబైకి?

By:  Tupaki Desk   |   23 July 2018 2:05 PM GMT
నిక్ జోనాస్ లేకుండా ఒక్కతే ముంబైకి?
X
ప్రియాంక చోప్రా జస్ట్ బాలీవుడ్ హీరోయిన్ స్టేజ్ నుండి టాప్ హీరోయిన్ స్టేజ్ కి చేరడమే కాదు.. చూస్తుండగానే అమెరికా ఫ్లైట్ ఎక్కి.. హాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ గ్లామర్ జెండా పాతింది. ఆ దెబ్బతో గ్లోబల్ జనాలందరూ ఆమె నటనకు.. గ్లామర్ కు జేజేలు పలుకుతున్నారు. ఈమధ్య పీసీ అమెరికాలోనే మకాం వేయడం, కొత్త బాలీవుడ్ సినిమాలకు సైన్ చెయ్యక పోవడంతో ముంబై కి రావడమే చాలా అరుదైన వ్యవహారంగా మారింది.

దాంతో కొన్ని రోజుల క్రితం ముంబైలో అడుగుపెట్టడం ఒక పెద్ద న్యూస్ అయింది. పైగా ప్రియుడు అని అందరూ అనుకుంటున్న అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ చేతిలో చెయ్యేసి మరీ ముంబైలో దిగడంతో 'పెళ్లి' మాటల కోసం ప్రియుడితో ఇండియాకొచ్చిందని బాలీవుడ్ కోడై కూసింది. వాళ్ళు ప్రియాంక ఫ్యామిలీతో గోవా వెళ్ళడం.. తిరిగి అమెరికా ఫ్లైట్ ఎక్కడం.. ఇదంతా ఓల్డ్ న్యూస్. కొత్త న్యూస్ ఏంటంటే ప్రియాంక యమా స్టైలిష్ గెటప్పు లో హాలీవుడ్ హీరోయిన్లను తలదన్నే విధంగా సోమవారం పొద్దున్నే ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగింది.. ఇప్పటికే ఆమె అల్ట్రా స్టైలిష్ ఫోటోలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

కానీ.. నిక్కు మాత్రం ఆవిడ పక్కన లేడు. దీంతో ప్రియుడు లేకుండా వచ్చావేంటమ్మా ప్రియాంకా అంటూ హిందీలో అడుగుతున్నారు బాలీవుడ్ జనాలు. వాళ్ళసంగతేమో గానీ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'భరత్' సినిమా షూటింగ్ కోసమే ఒంటరిగా వచ్చిందని కొందరు అంటున్నారు. మరి ప్రియుడికి పీసీకి కొన్నాళ్ళ విరహం తప్పదేమో! ఈ సినిమాల జిమ్మడ.. ఇద్దరు ఘాటు ప్రేమికుల్ని విడదీశాయి!