వీడియో: అమెరికా కోడలు ఆ కులుకేల!

Mon May 20 2019 10:45:00 GMT+0530 (IST)

కేన్స్ 2019 సంబరాల్లో ప్రియానిక్ సందడి గురించి తెలిసిందే. ఈ జంట ఎక్కడ కనిపించినా మీడియాకి కన్నుల పండుగే. రకరకాల డిజైనర్ డ్రెస్ లలో డిఫరెంట్ లుక్ తో అదరగొడుతున్నారు. హబ్బీ నిక్ జోనాస్ అండతో పీసీ చెలరేగిపోతోంది. రోమ్ వెళితే రోమన్ లా ఉండాలి! అన్న ఫార్ములాని తూ.చ తప్పక ఆచరిస్తోంది. ముఖ్యంగా ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లో పీసీ పూర్తిగా పాశ్చాత్య ధోరణికి అంకితమైంది. మునుపటిలా భారతీయత ఈ అమ్మడికి అడ్డు పడడం లేదు. అమెరికా కోడలు అన్న ట్యాగ్ తో హద్దు అన్నదే లేకుండా చెలరేగిపోతోంది.ఇకపోతే పీసీ ఏం చేసినా వంతపాడే హబ్బీనే దొరికాడు. దీంతో అసలే అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా వేదికలపై పీసీ బోల్డ్ అవతారం వేడెక్కించింది. తాజాగా కేన్స్ లోనూ అంతకుమించి చెలరేగిపోతోంది. ఇప్పటివరకూ అరడజను పైగానే రెడ్ కార్పెట్ నడకలతో అదరగొట్టిన పీసీ తాజాగా హబ్బీ నిక్ జోనాస్ తో కలిసి మరో డిఫరెంట్ బోల్డ్ అవతారంలో దర్శనమిచ్చింది. ఈసారి మునుపటి కంటే పక్కా బోల్డ్ లుక్ తో యూత్ గుండెల్లో అగ్గి రాజేసింది. పీసీ బోల్డ్ అవతార్ కి సంబంధించిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.

గ్రే మెటాలిక్ ఔట్ ఫిట్ లో పీసీ సంథింగ్ హాట్ గా కనిపించింది. ఆ విశాలమైన భుజ సౌందర్యాన్ని.. తొడల అందాల్ని ఎలివేట్ చేసే డిజైనర్ డ్రెస్ లో పూర్తి బోల్డ్ గా కనిపించింది. పీసీకి పూర్తి కాంట్రాస్ట్ లుక్ తో హబ్బీ నిక్ జోనాస్ చాలా సింపుల్ గా బ్లాక్ డ్రెస్ .. జిగ్ జాగ్ సూటులో ఫోజిచ్చాడు. డస్కీ బ్యూటీ.. బోల్డ్ క్వీన్ .. హార్ట్ థ్రోబ్ అంటూ నెటిజనులు పీసీకి కితాబిచ్చేస్తున్నారు. కొందరైతే అమెరికా కోడలు టూ హాట్ గురూ! అంటూ కామెంట్లను రువ్వుతున్నారు. మొత్తానికి కేన్స్ ఉత్సవాల్లో ప్రియానిక్ జంట ఎదురేలేకుండా గ్రాండ్ సక్సెస్ అనే చెప్పాలి. ఈ ఉత్సవాల అనంతరం పీసీ తన బాలీవుడ్ మూవీ `స్కై ఈజ్ పింక్` గురించిన వివరాల్ని వెల్లడించనుంది. సోనాలి బోస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా- సిద్ధార్థ్ రాయ్ కపూర్- రోనీ స్క్రూవాలా నిర్మాతలు. అక్టోబర్ 11న సినిమా రిలీజ్ కానుంది.