Begin typing your search above and press return to search.

పీసీ అవి కూడా మొదలెట్టేసింది

By:  Tupaki Desk   |   5 Jun 2017 6:23 AM GMT
పీసీ అవి కూడా మొదలెట్టేసింది
X
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇప్పుడు కంప్లీట్ గా హాలీవుడ్ పైనే ఫోకస్ చేసిందనే విషయం తెలుస్తూనే ఉంది. సీరయల్.. సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్న ఈ భామ.. బేవాచ్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అంతగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయినా.. అమ్మడి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

బేవాచ్ మూవీకి నెగిటివ్ రివ్యూలు వచ్చినా.. ఇప్పటికే రెండు హాలీవుడ్ ప్రాజెక్టులకు సైన్ చేసేసింది ప్రియాంక చోప్రా. మరోవైపు ఫోటోషూట్స్ తో హాలీవుడ్ జనాలను కంటిన్యూగా ఆకట్టుకోవడం పీసీకి బాగా ప్లస్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ ఎండార్స్ మెంట్స్ కూడా అమ్మడి చెంతకు చేరిపోతున్నాయి. ప్రస్తుతం ఓ అడ్వర్టెయిజ్మెంట్ కు చేసింది ప్రియాంక. స్పీకర్స్ కు సంబంధించిన ఈ యాడ్ సింపుల్ గానే ఉంది కానీ.. బాగానే ఆకట్టుకుంది. అమ్మడి ట్యాలెంట్ ను బయటపెట్టేసేంత సీన్ లేకపోయినా.. ఫస్ట్ అండార్స్ మెంట్ కావడంతో కమిట్మెంట్ బాగానే చూపింది పిగ్గీ ఛాప్స్.

ఇక హాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే.. ఏ కిడ్ లైక్ జేక్ అనే మూవీలో సింగిల్ మదర్ గా కనిపించనుంది ప్రియాంక చోప్రా. ట్రాన్స్ జెండర్స్ సమస్యల ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందనుండగా.. రెబెల్ విల్సన్ తో కలిసి ఓ రొమాంటిక్ కామడీ చిత్రంలో కూడా కనిపించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/