ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా: స్టార్ హీరోయిన్

Wed Sep 11 2019 12:49:43 GMT+0530 (IST)

ప్రతి విజయం వెనక ఎంతో తపన.. శ్రమ..కష్టాలు ఉంటాయి.  ఆఖరికి స్టార్ కిడ్స్ కు కూడా అవన్నీ తప్పవు.  బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చినవారికి ఆ ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ దశను దాటితేనే విజయం వరిస్తుంది.  గ్లోబల్ సుందరిగా పేరుతెచ్చుకున్న బాలీవుడ్ బుటి ప్రియాంక చోప్రా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.  తన కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ప్రియాంక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.తన కెరీర్ మొదట్లో తనను సినిమాకు తీసుకునేవారని.. తర్వాత సినిమానుంచి తొలగించే వారని చెప్పింది.  తనపై దర్శకులు కోపంతో అరిచేవారని.. చాలా సినిమాల నుండి తనను తొలగించారని షాకింగ్ అంశాలను వెల్లడించింది.  అయితే అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో తన తండ్రి ధైర్యం చెప్పేవారని ప్రియాంక అప్పటి సంగతులను గుర్తు చేసుకుంది.  ఎన్ని అవమానాలు ఎదురైనా వాటిని ఎలా అధిగమించాలా అని అలోచించి ధైర్యంగా ముందడుగు వేసేదాన్నని అదే తనను ఇంత దూరం తీసుకొచ్చిందని వెల్లడించింది.

బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియాంక ఈమధ్య ఎక్కువగా హాలీవుడ్ సినిమాలపై ఫోకస్ చేస్తోంది..  అయితే కొంత గ్యాప్ తర్వాత 'స్కై ఈజ్ పింక్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనాలి బోస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫర్హాన్ అఖ్తర్ మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు.  రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన దక్కింది.