Begin typing your search above and press return to search.

లైవ్ లో టకీలా ఏసేసిన ప్రియాంక

By:  Tupaki Desk   |   28 Oct 2016 10:30 PM GMT
లైవ్ లో టకీలా ఏసేసిన ప్రియాంక
X
హాలీవుడ్ లో చెలరేగిపోతున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఇప్పుడు అక్కడ అన్ని మేగజైన్స్ ను కవర్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. క్వాంటికో సీరియల్ దెబ్బకు.. పీసీకి విపరీతంగా క్రేజ్ పెరిగిపోగా.. ఇప్పుడు 'ది ఎల్లెన్ షో' లో కూడా పాలు పంచుకుంది. ఈ కార్యక్రమం ప్రారంభంలోనే టకీలాను ఓ షాట్ వేయాల్సిందిగా ఎల్లెన్ డీజెనెరెస్ కోరడం.. ప్రియాంక టక్కుమని టకీలా గ్లాస్ ఎత్తేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇంతవరకూ కామన్ అని సరిపెట్టేసుకుందామని అనుకుంటే.. ఆ షో జరుగుతున్నంత సేపు మధ్యమధ్యలో ప్రియాంకను ఇన్సల్ట్ చేస్తున్నట్లుగా కామెంట్స్ చేసింది ఎల్లెన్. నవ్వుతూ జోక్ చేస్తున్నట్లుగానే ఉన్నా.. అందులో అంతకుమించిన నిగూడార్ధాలు దొరికాయి అభిమానులకి. మిస్ వరల్డ్ కిరీటం గెలిచాక.. కరెంట్ బల్బ్ తీస్తున్నట్లు చెయ్యి ఊపారేంటి అనే క్వశ్చన్ అభిమానులకు బాగానే మండించింది కానీ.. పీసీ మాత్రం లైట్ తీసుకుంది.

మీరు వరల్డ్ స్టార్ అయిపోయారుగా అని ఎల్లెన్ అంటే.. అలాంటిదేమీ లేదని ప్రియాంక ఆన్సర్ ఇవ్వడం.. నాకూ తెలిసినా ఏదో పొగడాలి కాబట్టి పొగుడుతున్నా అనేసింది ఎల్లెన్. ఈ కామెంట్ మాత్రం కావాలనే ప్రియాంకా చోప్రాను అవమానించడమే అని ఫ్యాన్స్ బాగా ఫీలయిపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/