ఈ సోకులతో ఇక పనవ్వదేమో

Wed May 23 2018 17:07:37 GMT+0530 (IST)

మిస్ వరల్డ్ గా గెలుపొందడం అంటే చిన్న విషయం కాదు. అందుకే ఐశ్వర్య రాయ్.. సుస్మితా సేన్.. ప్రియాంక చోప్రా వంటి భామలను మనం చాలా ప్రత్యేకంగా చూస్తుంటాం. ఈ భామలందరూ సాధారణంగానే బాలీవుడ్ లోకి అడుగుపెట్టేసి ఆ తరువాత హాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. తన సీనియర్ల తరహాలో ప్రియాంక కూడా అలాగే ప్రయత్నించి.. హాలీవుడ్ లో ఒక పెద్ద సీరియల్ తో పాటు కొన్ని సినిమాలు కూడా చేసింది.అయితే ఎబిసి నెట్వర్క్ వారు క్వాంటికో సీరియల్ ను నిలిపేసిన తరువాత.. అమ్మడు తిరిగి ఇండియా వచ్చేస్తోంది. ఆ మద్యన హాలీవుడ్ లో దాదాపు ప్రతీ చిన్నాచితకా మ్యాగజైన్ కోసం కవర్ పేజీలకు హాటు హాటుగా ఫోజులిచ్చినా.. ఎందుకో అక్కడ పెద్దగా పనవ్వలేదు. అదిగో అలాంటి ఒక మ్యాగజైన్ కోసం అమ్మడు తన సందలన్నీ కళ్ళారా ఆరగించండి అంటూ ఎలా అరువిచ్చుందో చూసుకోండి. ప్రియాంక ఖచ్చితంగా ఒక గమ్మత్తైన సోయగం అని ఈ ఫోటోను చూస్తే చెప్పొచ్చు. కాని ఈ సోకులకు ఇక చీటి చెల్లిందా?

ప్రస్తుతం ఇండియా వచ్చేసిన ప్రియాంక.. ఇక్కడ సల్మాన్ ఖాన్ తో 'భరత్' అనే సినిమాలో కనిపించనుంది. అయితే సల్మాన్ సినిమాల్లో హీరోయిన్లకు ఎంత మాత్రం క్యారక్టర్లు ఉంటాయో తెలిసిందే. అలాగే ప్రియాంక పాటల్లో తన అందాల ప్రదర్శన చేసినా కూడా.. ఇప్పుడు ఆమెను తలదన్నే హాట్ భామలకే ఇక్కడ కేరాఫ్ అడ్రస్ దొరకట్లేదు. చూద్దాం ప్రియాంకకు మరోసారి బాలీవుడ్ లో ఏదన్నా టర్నింగ్ పాయింట్ వస్తుందేమో.