ప్చ్.. పీసీ షేపులు మారుతున్నాయే

Mon Jan 02 2017 10:14:21 GMT+0530 (IST)

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ లో మకాం పెట్టేసిన సంగతి తెలిసిందే. క్వాంటికో సీరియల్ తో మొదలుపెట్టి.. బేవాచ్ మూవీలో నెగిటివ్ రోల్ చేసేవరకూ వచ్చేసింది ప్రియాంక హాలీవుడ్ కెరీర్. అక్కడే ఎక్కువగా ఉంటున్నా.. తాను పర్మినెంట్ అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకోవడం లేదంటూ రీసెంట్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది పీసీ.

కెరీర్ సంగతి బాగానే ఉంది కానీ.. హాలీవుడ్ వెళ్లాక ప్రియాంక సైజుల్లో మాత్రం తేడాలు స్పష్టంగా కనిపించేస్తున్నాయ్. గతంలో ఇక్కడ నాజూకు నడుము వయ్యారిగా కనిపించే ఈ సుందరాంగి.. ఇప్పుడు మడతల్లో కూడా తేడాలు తెలిసిపోయేంతగా లావయిపోయింది. బికినీలతో రచ్చ రచ్చ చేసి స్లిమ్ ఫిగర్ ను చూపించిన ప్రియాంక.. ఇప్పుడంత ఫిట్ గా లేదనే సంగతి కనిపిస్తూనే ఉంది.

ప్రియాంక ఫిజిక్  స్లిమ్ గా ఉంటేనే బాగుంటుందనడంలో సందేహం అక్కర్లేదు. కాని ఎందుకో మరి న్యూ యార్క్ కు మకాం మర్చాక బాడీ సైజులు డబుల్ అయిపోయినట్లుగా ఉంది. అయినా.. ఫిట్నెస్ విషయంలో మనకంటే నాలుగు అడుగులు ముందే ఉంటారు హాలీవుడ్ జనాలు. మరి పీసీ మాత్రం ఎందుకిలా ఊరిపోతోందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/