Begin typing your search above and press return to search.

ప్రియాంక 100 కోట్ల బంగళా కథ..

By:  Tupaki Desk   |   22 Jun 2018 10:58 AM GMT
ప్రియాంక 100 కోట్ల బంగళా కథ..
X
బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముంబైలో తన ప్రియుడితో కలిసి ల్యాండ్ అయ్యింది. ఇన్నాళ్లు విదేశాల్లో తిరిగిన ఈ జంట ఇప్పుడు ఏకంగా దేశంలో దర్శనమీయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ప్రియాంక ముంబైలో కొత్తగా ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఆ భవనం గృహ ప్రవేశం కోసమే తన ప్రియుడితో కలిసి వచ్చిందని సమాచారం. ప్రియాంక ఈ ఇంటిని రూ.100 కోట్లు పెట్టి కొన్నదని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ముంబై నడిబొడ్డున ఆరేబియా సముద్రానికి అభిముఖంగా ఈ బంగళా ఉన్నట్టు సమాచారం. ప్రియాంక తన ప్రియుడు నిక్ కు బహుమతి ఇవ్వడం కోసమే ఈ బంగళా కొన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఇల్లు గృహప్రవేశం తర్వాత కొన్ని రోజుల పాటు నిక్ - ప్రియాంక ఈ ఇంట్లోనే సహజీవనం చేస్తారనే పుకార్లు వ్యాపిస్తున్నాయి. అందుకే తన వెంట ప్రియుడు నిక్ ను తీసుకొచ్చినట్టు తెలిసింది.

ప్రియాంక గత కొన్నాళ్లుగా అమెరికాలోనే ఎక్కువగా ఉంటోంది. హాలీవుడ్ సినిమాలు - అమెరికన్ టీవీ సిరీస్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది. ఆ డబ్బుతోనే ముంబైలో 100 కోట్లతో బంగళా కొన్నట్టు టాక్..