Begin typing your search above and press return to search.

సెక్సీ విలన్ గా ప్రియాంక సూపర్

By:  Tupaki Desk   |   27 April 2017 8:00 AM GMT
సెక్సీ విలన్ గా ప్రియాంక సూపర్
X

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయిన ప్రియాంక చోప్రా.. ఇప్పటికే ఓవర్సీస్ లో బోలెడంత క్రేజ్ సంపాదిచుకుంది. బ్యూటీ ర్యాంకింగ్ లో హాలీవుడ్ సుందరాంగులను కూడా మించిపోతోందంటే.. అమ్మడికి అమెరికాలో ఎంతగా డిమాండ్ ఉందో తెలుస్తుంది.

క్వాంటికో సీరియల్ తో మొదలుపెట్టిన ప్రియాంక హాలీవుడ్ జర్నీ.. బేవాచ్ మూవీతో కొత్త టర్న్ తీసుకోనుంది. బేవాచ్ మూవీలో ప్రియాంక నెగిటివ్ రోల్ లో కనిపించనుండగా.. ఇప్పటివరకూ రిలీజ్ అయిన రెండు ట్రైలర్లలోనూ పీసీకి ఇంపార్టెన్స్ దక్కలేదు. దీంతో ఏదో చిన్నా చితకా పాత్ర చేస్తోందని అంతా అనుకునే అవకాశం ఇచ్చినట్లైంది. ఇప్పుడు బేవాచ్ మూవీకి మూడో ట్రైలర్ విడుదల చేయగా.. ఇందులో ప్రియాంకకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు. సెక్సీ విలన్ రోల్ లో అమ్మడు అదరగొట్టేసింది. అమాయకంగా నటిస్తూ పండించే విలనిజం అదిరిపోయింది. నేను డ్రగ్ డీలర్ లా కనిపిస్తున్నానా అంటూ పీసీ క్వశ్చన్ చేయడంతో.. భారీ ఎక్స్ పోజింగ్ సన్నివేశాలను కూడా బాగానే చొప్పించారు.

మొత్తం మీద బేవాచ్ మూవీలో పిగ్గీ ఛాప్స్ రోల్ ఎలా ఉంటుందనే విషయం ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ తో అర్ధమవుతుంది. ప్రియాంక క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. ఉద్దేశ్యపూర్వకంగానే ఈమె పాత్రకు సంబంధించిన డీటైల్స్ ను ఇన్నాళ్లూ మేకర్స్ బాగా తగ్గించి చూపించారు. ఇప్పుడు జూన్ 2న రిలీజ్ అంటూ రిలీజ్ చేసిన ట్రైలర్ లో మాత్రం విలన్ గా ప్రియాంక చోప్రా తన విశ్వరూపం చూపించేసింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/