Begin typing your search above and press return to search.

చిన్మయి ఆవేదనలో అర్థం ఉంది

By:  Tupaki Desk   |   19 Jan 2019 4:34 AM GMT
చిన్మయి ఆవేదనలో అర్థం ఉంది
X
డబ్బింగ్ ఆర్టిస్ట్ కం సింగర్ గా తెరవెనుక ఎంత గొప్ప పేరున్నప్పటికీ గత కొంత కాలంగా మీ టూ వల్లే ఎక్కువ జనానికి రీచ్ అయిన పేరు చిన్మయి. కోలీవుడ్ లో సుప్రసిద్ధ గీత రచయిత వైరముత్తు మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసాక వేరే సాకుతో సభ్యత్వం రద్దుకు గురైన చిన్మయి ఆ తర్వాత దూకుడు తగ్గించింది కానీ మహిళా వివక్ష పట్ల తన పోరాటాన్ని ఆన్ లైన్ లో సాగిస్తూనే ఉంది. తన ప్రశ్నలు కూడా చాలా సంబద్ధంగా లాజిక్ తో ఉంటాయి.

తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న 10 ఇయర్స్ ఛాలెంజ్ మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు పదేళ్ల వెనుక ఫోటోలను ఇప్పటివాటితో జోడించి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సెలెబ్రిటీలు కూడా మినహాయింపు కాదు లెండి. అయితే కొందరు ఆకతాయిలు దీన్ని వ్యంగ్యాస్త్రంగా మార్చుకోవడం ఇబ్బందులకు గురి చేస్తోంది.

ఇటీవలే తన కన్నా పదకొండేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రాను టార్గెట్ చేసింది ఈ బ్యాచ్. 2009లో ఫోటో అంటూ నెలల వయసున్న ఓ బుడతడిని ముద్దు పెట్టుకున్న ప్రియాంకా ఫోటోను పెట్టి దాని కిందా ప్రియాంక నిక్ ల పిక్ ని దానికి జోడించారు. అంటే అప్పుడు పసిగుడ్డుగా ఉన్న నిక్ ని ఇప్పుడు పెళ్లి చేసుకుంది అని అర్థం వచ్చేలా. దీన్నే చిన్మయి ఉదహరిస్తూ పాతికేళ్ళు చిన్నవాళ్లను పెళ్లి చేసుకునే మగాళ్లున్న దేశంలో 60 ఏళ్ళు పైబడినా వివాహానికి సిద్ధపడే ప్రబుద్ధులున్న ప్రపంచంలో తన కన్నా కొంత చిన్నవాడైన వ్యక్తిని పెళ్ళి చేసుకున్నందుకు ప్రియాంకాను టెన్ ఇయర్స్ ఛాలెంజ్ లో మేమ్ పేరుతో హాస్యానికి వాడుకున్నారని చురకలు వేసింది. చిన్మయి అన్నదాంట్లో పాయింట్ ఉంది. క్రికెటర్లు సినిమా తారలుగా ఉండే మగరాయళ్ళు ఇలాంటివి ఏది చేసినా ప్రశ్నించని సమాజం ఆడవాళ్ళ విషయంలో మాత్రమే ఇలా రియాక్టర్ అవ్వడం సరికాదుగా