Begin typing your search above and press return to search.

షాక్ ఇవ్వబోతున్న ప్రియమణి

By:  Tupaki Desk   |   29 Nov 2015 5:30 PM GMT
షాక్ ఇవ్వబోతున్న ప్రియమణి
X
హీరోలు దర్శకులుగా మారడం ఎప్పట్నుంచో ఉన్నదే కానీ.. హీరోయిన్లు మెగా ఫోన్ పట్టడం చాలా అరుదుగా జరిగే విషయం. తెలుగులో విజయనిర్మల మాత్రమే ఈ ఘనత సాధించింది. ఒకప్పటి తమిళ హీరోయిన్ శ్రీప్రియ కూడా ఈ మధ్యే ‘దృశ్యం’ సినిమాతో మెగా ఫోన్ పట్టింది. ఇప్పుడు వీళ్లిద్దరి బాటలోనే నడవడానికి హాట్ బ్యూటీ ప్రియమణి కూడా రెడీ అయిపోతోంది. ఒకప్పుడు తెలుగు - తమిళ భాషల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు కన్నడలో చిన్నా చితకా సినిమాలు చేసుకుంటున్న ప్రియమణి.. త్వరలోనే దర్శకత్వం అరంగేట్రం చేయబోతోందట. ప్రస్తుతం తాను కథలు రాసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పింది ప్రియమణి.

ఈ మధ్య కన్నడ సూపర్ స్టార్ సుదీప్ నిర్వహించే ‘బిగ్ బాస్’ షోకు గెస్ట్ గా వచ్చిన ప్రియమణి.. సుదీప్ హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలన్నది తన కల అని వెల్లడించింది. ప్రియమణి ఏదో తమాషాకు అంటోందని అనుకున్నారు కానీ.. తాను నిజంగానే డైరెక్షన్ చేయలన్న ప్లాన్ తో ఉన్నానని.. త్వరలోనే సినిమా కూడా మొదలు కావచ్చని చెప్పి షాకిచ్చింది ప్రియమణి. ముస్తఫా రాజ్ అనే ఓ బిగ్ షాట్ తో ప్రియమణి ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ముస్తఫా దగ్గర డబ్బులకు కొదవేమీ లేదు కాబట్టి ప్రియమణి డైరెక్షన్లో అతనే సినిమా తీసినా తీయొచ్చేమో. ఇంతకీ ప్రియమణి దర్శకత్వం వహించే తొలి సినిమా ఏ భాషలో ఉంటుందో?