Begin typing your search above and press return to search.

మా మతాలు వేరే కాబట్టే -ప్రియమణి

By:  Tupaki Desk   |   19 Aug 2017 10:54 AM GMT
మా మతాలు వేరే కాబట్టే -ప్రియమణి
X
ఒక హీరో పెళ్లి చేసుకుంటున్నాడు అంటే అది పెద్ద చర్చకు దారి తీయదు. కానీ అదే ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది అంటే మాత్రం ఎవరిని చేసుకుంటుంది ఎప్పుడు చేసుకోబోతోంది సినిమాలు లేక చేసుకుంటుందా పెళ్ళైన తరువాత నటిస్తుందా ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చేస్తాయ్. సౌత్ ఇండియాలో ఫేమస్ హీరోయిన్ ప్రియమణి తన చిరకాల ప్రియడ్ని పెళ్లి చేసుకోబోతోంది అనే విషయం తెలిసిందే కదా. ఈ నెల 23 తేదిన ప్రియడు ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకోబోతోంది. కాకపోతే అందరూ అనుకునేటట్లు ఘనంగా కాకుండా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకొని ఆ తరువాత గ్రాండ్ గా రిసెప్షన్ ఇస్తోంది.

తన పెళ్లి గురించి ఆ తరువాత తన ప్లాన్స్ గురించి సౌత్ బ్యూటీ ప్రియమణి ఏమంటోందంటే.. “మేము రిజిస్టర్ పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఉంది. మా ఇద్దరి మతాలు ఒక్కటి కావు. రెండు వేరు వేరు పద్దతులలో పెళ్లి చేసుకోవడం కన్నా ఈ రిజిస్టర్ పెళ్లి బెటర్ అనిపించింది. ముస్తఫా నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. పెళ్ళైన మరుసటి రోజే గ్రాండ్ గా ఒక రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశాము నా ఫిల్మ్ ఫ్రెండ్స్ కోసం అతని ఫ్రెండ్స్ కోసం” అని చెప్పింది. అలా చెబుతూనే నేను పెళ్ళైన రెండో రోజు నుండే సినిమా షూటింగ్లతో బిజీ అవ్వబోతున్నా అని కూడా అంటోంది. ఎందుకంటే నేను ఇదివరికే ఒప్పుకున్న సినిమాలు ఇంకా పూర్తి చేయవలిసినవి ఉన్నాయి. పెళ్లి తరువాత కూడా నేను సినిమాలలో నటిస్తాను అని చెప్పింది.

బెంగళూరు లో కొద్ది మంది బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య 23న పెళ్లి చేసుకోబోతోన్నారు ఈ జంట. ఇక ప్రియమణి ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ 2 అనే ఒక మలయాళం సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే కొన్ని కన్నడ సినిమాలలో కూడా హీరోయిన్ గా కనబడనుంది. ఇప్పుడు తెలుగులో ఏ సినిమాలు చేయకపోయినా కూడా ఒక టి‌వి డాన్స్ షో కి జడ్జ్ గా చేస్తోంది.