Begin typing your search above and press return to search.

మరో బ్రాండ్ పట్టిన వైరల్ పిల్ల

By:  Tupaki Desk   |   25 May 2018 4:10 AM GMT
మరో బ్రాండ్ పట్టిన వైరల్ పిల్ల
X
ప్రియా ప్రకాష్ వారియర్ గురించి.. ఇండియన్ మూవీ లవర్స్ కు గానీ.. గ్లామర్ ప్రియులకు గానీ స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక్కసారి కన్ను కొట్టి కోట్లామంది హృదయాలను కొల్లగొట్టిన ట్యాలెంట్ ఈ భామది. ఇంకా ఆ ఒక్క సినిమా థియేటర్లలోకే రాలేదు కానీ.. ఈమె క్రేజ్ మాత్రం వైరల్ గా పెరిగిపోతూనే ఉంది.

సినిమా సక్సెస్ సాధించి.. గుర్తింపు తెచ్చుకుంటే అందులో కిక్కేముంది? అంతకు ముందే ఎంత హంగమా చేయాలో అంతా చూపించేస్తోంది ప్రియ. ఇప్పటికే ఫాలోయింగ్ విషయంలో చాలామంది స్టార్స్ ను దాటేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఓ బడా బ్రాండ్ కు ప్రచారం చేసేందుకు అంగీకరించింది కూడా. అంతే కాదు.. షూటింగ్ కూడా చేసేసినట్లు.. ఓ ఫోటో ద్వారా జనాలకు తెలియచెప్పింది ఈ కుర్ర భామ. ఐపీఎల్ సీజన్ లో.. నెస్ట్లే బ్రాండ్ మంచ్ యాడ్ లో కనిపిస్తేనే ఔరా అనుకున్నారు ఆడియన్స్.

ఇప్పుడు సౌతిండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది ప్రియా ప్రకాష్. గతంలో జెనీలియా.. ఇప్పుడు అఖిల్.. సమంతలతో ప్రచారం చేయిస్తున్న ఈ సంస్థ.. లేటెస్ట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ను కూడా తెచ్చుకుంది. చిన్న వయసులోనే.. ఇంకా సినిమా రిలీజ్ లేకుండానే.. ప్రియా ప్రకాష్ క్రేజ్ ఈ రేంజులో ఉంటే.. ఇక నటనతోను గ్లామర్ తోను మెప్పించిందంటే మాత్రం.. ఆ లెక్కే వేరుగా ఉంటుందేమో?