Begin typing your search above and press return to search.

సైరా ఫార్ములాను కాపీ కొడుతున్నారుగా!

By:  Tupaki Desk   |   16 Feb 2019 11:35 AM GMT
సైరా ఫార్ములాను కాపీ కొడుతున్నారుగా!
X
ఇప్పుడు వంద కోట్ల బడ్జెట్ దాటిన ఏ సినిమానైనా ఏదో ఒక్క భాషలో రిలీజ్ చేసుకుంటే సరిపోదు. మల్టీ లాంగ్వేజ్ వెర్షన్స్ ప్లాన్ చేసుకుంటేనే నాలుగు డబ్బులు మిగులుతాయి. బాహుబలిలో ఈ ఫార్ములాను విజయవంతంగా అమలు పరిచిన రాజమౌళి కన్నా ఓ రెండాకులు ఎక్కువ చదివిన రీతిలో సురేందర్ రెడ్డి తన సైరా నరసింహారెడ్డి కోసం వేర్వేరు బాషల నుంచి ఆర్టిస్టులను తీసుకున్న సంగతి తెలిసిందే.

హిందీ నుంచి అమితాబ్ బచ్చన్ కన్నడ నుంచి సుదీప్ తమిళ్ నుంచి విజయ్ సేతుపతి ఇలా అన్ని సమపాళ్ళలో ఆర్టిస్టులను మిక్స్ చేసి మార్కెటింగ్ కి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకున్నాడు. బాహుబలిలో బాలీవుడ్ నటులు కనిపించరు. అదే ప్రధానమైన తేడా. ఇప్పుడు మరో గ్రాండియర్ మూవీ సైరానే ఫాలో అవుతోంది.

దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మాస్ట్రో డైరెక్టర్ ప్రియదర్శన్ మోహన్ లాల్ హీరోగా మరక్కర్-అరబీకదలింటే అనే మల్టీ స్టారర్ తీస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్ లో జరుగుతోంది. ఇందులో సైరాలాగే విశేషాలున్నాయి. తమిళ్ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్-డాన్స్ సెన్సేషన్ ప్రభుదేవాతో పాటు మరో సీనియర్ నటుడు ప్రభు కూడా ఉన్నాడు. అంతే కాదు సైరాలో అరకు రాజుగా నటిస్తున్న కిచ్చ సుదీప్ ను కన్నడ మార్కెట్ కోసం తీసుకున్నారు. ఇక హీరోయిన్ ఎవరో కాదు. మహానటిలో పెర్ఫార్మన్స్ తో మతులు పోగొట్టిన కీర్తి సురేష్. దీని విడుదల గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. మొత్తానికి అన్ని బాషల్లోనూ మల్టీ స్టారర్స్ హవా ఓ రేంజ్ లో ఉందన్న మాట