కన్నుగీటు సుందరికి గర్వభంగం

Sun Sep 23 2018 16:09:54 GMT+0530 (IST)

కొద్దినెలల క్రితం ఓరు ఆధార్ లవ్ అనే మలయాళం సినిమా టీజర్ లో కన్నుగీటి ప్రపంచ వ్యాప్తంగా భారతీయ యువతను తన వలలో వేసుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ నెలల తరబడి హాట్ స్టార్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆఖరికి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఏదైనా పోస్ట్ చేయాలన్నా లక్షలు డిమాండ్ చేసే రేంజ్ కు చేరుకుంది. సౌత్ తో పాటు నార్త్ అగ్ర దర్శక నిర్మాతలు తనతో సినిమాలు చేసేందుకు ప్రయత్నించింది కూడా నిజమే. కాని ఓరు ఆధార్ లవ్ దర్శకుడు ఒమర్ లులుతో ఉన్న ఒప్పందం కారణంగా అవన్నీ వదులుకున్న ప్రియా వారియర్ అదే సినిమాలో మరో పాటతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే తనను మొదటి పాటలో అభిమానులు ఎంత ఇష్టపడ్డారో అంతకు ఎన్నో రేట్లు ఎక్కువగా ఇందులో తన లుక్ ని  తిట్టిపోస్తుండటంతో షాక్ తినడం ప్రియా ప్రకాష్ వారియర్ వంతైంది.ఇదంతా కావాలని ఎవరో గిట్టని వాళ్ళు ఇలా చేస్తున్నారని ఒమర్ లులు ప్రియాలు చెప్పుకుంటున్నప్పటికీ నిజంగానే పాట మరీ తీసికట్టుగా ఉంది. ఏ ప్రత్యేకత లేకుండా ఓ సాధారణ యూత్ సాంగ్ ని అంతకంటే మాములుగా అనిపించే ఓ ట్యూన్ తో లాగించడమే ఇన్ని విమర్శలకు కారణం. పరిస్థితి ఎలా ఉందంటే 1 లక్ష లైకులు వస్తే డిజ్ లైకులు మాత్రం ఏకంగా 6 లక్షలకు దగ్గర్లో ఉన్నాయి. ఎపుడో కానీ అరుదుగా ఇన్నేసి లక్షల డిజ్ లైకులు వీడియోలకు వస్తుంటాయి. దీంతో ప్రియా వారియర్ కు బాగా ఇబ్బందిగా ఉంది. తను కనిపిస్తే చాలు వ్యూస్ వర్షం కురిసి యువత వెర్రెక్కిపోతారు అనుకుంటే ఇలా కామెంట్ల బాణాలు విసురుతుండటంతో ఏది పాలు పోవడం లేదు. షాన్ రెహమాన్ అందించిన సంగీతం మీద సైతం విమర్శలు వస్తున్నాయి. హైప్ కోసం ఏడాదికి పైగా విడుదల ఆలస్యం చేస్తూ నానబెడుతున్న ఓరు  ఆధార్ లవ్ కు  ముందున్న బజ్ ఇప్పుడు  లేదని ట్రేడ్ టాక్. అందుకే వేడిగా ఉన్నప్పుడే పాలు తాగాలి. హైప్ ఉన్నప్పుడే సరైన టైంలో సినిమా పూర్తి చేసి విడుదల చేయాలి. లేదంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి.